అటవీ కార్మికులకు సిపిఐ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి మద్దతు

Jan 28,2024 22:58
అటవీ కార్మికులకు సిపిఐ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి మద్దతు

శ్రీ పలు ప్రజా సంఘాలు సంఘీబావంశ్రీ ఆటపాటలతో ఆకట్టుకున్న మహిళలుప్రజాశక్తి- తిరుపతి సిటి, తిరుపతి టౌన్‌: రాష్ట్ర ముఖ్యమంత్రి హామీ మేరకు, టిటిడి తీర్మానం ప్రకారం, కోర్టు ఆదేశాలను సారం తమకు న్యాయం చేయాలని కోరుతూ టిటిడి అటవీ కార్మికులు 1159 రోజులుగా సాగిస్తున్న నిరాహరదీక్షలకు మద్దతుగా సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి కందారపు మురళీ చేపట్టిన నిరవధిక దీక్షకు సిపిఐ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి, ఎంఎల్‌ఏ కూనంనేని సాంబశివరావు మద్దతు తెలిపారు. తిరుపతి నగరంలోని హారేరామ హరేకృష్ణ రోడ్డులోని టిటిడి డిఎఫ్‌ఐ కార్యాలయం ఎదుట ఏర్పాటు చేసిన దీక్షాశిబిరాన్ని ఆదివారం ఆయన సందర్శించారు. ఈసందర్భంగా కార్మికులు మద్దతు తెలియజేసి ఆయన మాట్లాడుతూ అటవీకార్మికులది అలుపెరగని పోరాటమన్నారు. ఎర్రజెండాను ఆపడం ఎవ్వరి తరం కాదన్నారు. హిటర్లు లాంటి వారే ఈ జెండాను చూసి వెనకంజువేశారని గుర్తు చేశారు. అటవీ కార్మికులు చేపట్టిన ఉద్యమం న్యాయ సంబంధితమైనదని, కోర్టు కూడా టిటిడి తీరును ఒప్పకోదన్నారు. భౌతిక పోరాటాలతో పాటు న్యాయపోరాటం కూడా చేయాలని కార్మికులకు సూచించారు. కమ్యూనిస్టులకు ప్రజలే దేవుళ్లు అని వెల్లడించారు. టిటిడి సంస్థ ధర్మకోసం పనిచేయాలని, కానీ టిటిడి యాజమాన్యం వెంకటేశ్వరస్వామి పేరు చెప్పకుని పేదలు, కార్మికుల రక్తాన్ని పీల్చేడం విడ్డూరమన్నారు. కొన్ని రోజులు పోతే బూర్జవ రాజకీయ నాయకులు దేవున్ని కూడా మింగేస్తారని ధ్వజమెత్తారు. టిటిడి అనేది అందరికి, ఏ కొందరిది కాదని హెచ్చరించారు. దేవునికి రక్షణ ఇచ్చే అడవిని కాపాడే కార్మికులు సమస్యలు పరిష్కరించాలని డిమాండు చేశారు. కార్మికులు చేపట్టే పోరాటానికి తమ సంపూర్ణ మద్దతు అందిస్తామన్నారు. సిపిఐ రాష్ట్ర నాయకులు రామానాయుడు మాట్లాడుతూ అటవీ కార్మికుల కుటుంబాల భవిష్యత్తు కోసం కందారపు మురళీ దీక్షకు కుర్చున్నారని, సోమవారం జరిగే బోర్డులో కార్మికుల సమస్యలకు పరిస్కారం ఇవ్వకపోతే రాబోవు ఎన్నికల్లో బూర్జవ నాయకులను ప్రతి గ్రామగ్రామాన నిలదీయాలని సూచించారు. అంతకు ముందు సిపిఎం తిరుపతి జిల్లా కార్యదర్శి వందవాసి నాగరాజు కార్మికులకు మద్దతుగా ఆలపించిన ఉయ్యాలపాట ఉత్తేజపరిచింది. పలు ప్రజాసంఘాలకు చెందిన మహిళలు కోలాటాలు, గొబ్బమ్మ పాటలతో అలరించారు. అన్నమయ్య ప్రాజెక్టుకు చెందిన కళాకారులచే ఏర్పాటు చేసిన సంకీర్తన ఆలాపనలు ఆకట్టుకున్నాయి. అటవీ కార్మికులకు, కందారపు మురళీ దీక్షలకు సిపిఎం, అంగన్‌వాడీ వర్కర్స్‌, హెల్పర్స్‌, ఆశా వర్కర్లు, ఏఐటియుసి, పలు ప్రజాసంఘాలు మద్దతు పలికాయి. కార్యక్రమంలో సిఐటియు నాయకులు జి.బాలసుబ్రమణ్యం, మల్లారపు మురళీ, ఆర్‌.లక్ష్మీ. వాణిశ్రీ, నాగ వెంకటేశం, సిపిఐ నాయకులు మురళీ, చిన్నం పెంచులయ్య, విశ్వనాద్‌, రాధాకృష్ణ, అటవీకార్మిక సంఘం నాయకులు సురేష్‌, పురుషోత్తం, ఈశ్వర్‌రెడ్డి, మునికృష్ణయ్య, కృష్ణమూర్తి, విశ్వనాథన్‌, రామ్మూర్తిరెడ్డి, శ్రీనివాసులు, కార్మికులు పాల్గొన్నారు.

➡️