అత్యున్నత ఫలితాలకు కృషి చేయాలి : డిఇఒ

అత్యున్నత ఫలితాలకు కృషి చేయాలి : డిఇఒ

అత్యున్నత ఫలితాలకు కృషి చేయాలి : డిఇఒప్రజాశక్తి – తిరుపతి టౌన్‌మారుతున్న ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని దష్టిలో ఉంచుకొని, పాఠశాల విద్యలో విద్యార్థులు అత్యున్నత ఫలితాలు సాధించే విధంగా ఉపాధ్యాయులు కషి చేయాలని తిరుపతి జిల్లా విద్యాశాఖ అధికారి డాక్టర్‌ వి శేఖర్‌ కోరారు. స్థానిక కలెక్టరేట్‌ లోని డీఈవో కార్యాలయ ఆవరణలో ఆంధ్రప్రదేశ్‌ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్‌ డైరీ, క్యాలెండర్ను ఆవిష్కరించిన సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వం విద్యా రంగంలో తీసుకొస్తున్న విప్లవాత్మక మార్పులను స్వాగతిస్తూ, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ప్రాథమిక స్థాయి నుండి ఉన్నత స్థాయి వరకు తీసుకెళ్లి విద్యార్థులు సర్వతో ముఖాభివద్ధి సాధించే విధంగా ప్రతి ఉపాధ్యాయుడు కషి చేయాలని కోరారు. యూటీయఫ్‌ కొన్ని సంవత్సరాలుగా పదవ తరగతి విద్యార్థుల కోసం అతి తక్కువ ఖర్చుతో మోడల్‌ పేపర్లను రూపొందించి విరివిగా పంపిణీ చేస్తోందని, ఆ మోడల్‌ పేపర్లు విద్యార్థులకు చాలా ఉపయోగకరంగా ఉన్నాయని ప్రశంసించారు. యూటీయఫ్‌ రాష్ట్ర కార్యదర్శి ఎస్‌ ఎస్‌ నాయుడు, జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు జి జె రాజశేఖర్‌, కె ముత్యాల రెడ్డి పాల్గొన్నారు

➡️