అర్థశాస్త్ర అధ్యాపకునికి ఘన సన్మానం

అర్థశాస్త్ర అధ్యాపకునికి ఘన సన్మానం

అర్థశాస్త్ర అధ్యాపకునికి ఘన సన్మానంప్రజాశక్తి – గూడూరు టౌన్‌ : స్థానిక ఎస్‌కెఆర్‌ డిగ్రీ కళాశాల అర్థశాస్త్ర అధ్యాప కులు బి పీర కుమార్‌ కి విక్రమ సింహపురి విశ్వవి ద్యాలయం డాక్టరేట్‌ ప్రక టించ డం పట్ల ప్రశంసి స్తూ కళాశాల ప్రిన్సిపాల్‌, అధ్యాపకులు శుక్రవారం ఆయనను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ పి వెంకటేశ్వర్లు మాట్లడుతూ పీర కుమార్‌ కషిని, అతని పరిశోధనల గురించి పేర్కొన్నారు. ‘ఆంధ్ర ప్రదేశ్‌ లోని ప్రధాన పంటలు అనే అంశం లో చేసిన పరిశోధనకు డాక్టరేట్‌ రావడం కళాశాలకు ఎంతో గర్వ కారణ మని తెలిపారు. ఈ కార్యక్రమంలో వైస్‌ ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ వై శ్రీనివాసులు, అధ్యాప కులు డాక్టర్‌ శివ ప్రసాద్‌, డాక్టర్‌ కె కోటేశ్వరరావు, డాక్టర్‌ గోవిందు , సురేంద్ర, ఎస్‌ శ్రీధర్‌ శర్మ, కిరణ్మయి, కష్ణమూర్తి గ్రంథాలయ అధ్యాపకులు డాక్టర్‌ పి విజయ మహేష్‌ కుమార్‌, అధ్యాపక, అధ్యాపకేతర సిబ్బంది పాల్గొన్నారు.

➡️