అలరించిన ‘విరించి’ ఫ్లాష్‌ మాబ్‌

అలరించిన 'విరించి' ఫ్లాష్‌ మాబ్‌

అలరించిన ‘విరించి’ ఫ్లాష్‌ మాబ్‌ప్రజాశక్తి – క్యాంపస్‌ విద్యార్థినిలు సాంకేతిక విద్యతో పాటు సాంస్కతిక సంగీత కార్యక్రమాల్లో పాల్గొనడం ద్వారా పరిపూర్ణ మూర్తిమత్వం పొందగలరని శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య డి భారతి పేర్కొన్నారు. శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం ఇంజినీరింగ్‌ విద్యార్థినులు విద్యాలయం ప్రాంగణంలో శనివారం ఫ్లాష్‌ మాబ్‌ కార్యక్రమాన్ని నిర్వహించారు. ”విరించి 2కె24” సందర్బంగా ఈ కార్యక్రమం జరిగింది. ముఖ్య అతిధులుగా ఆచార్య డి. భారతి, శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్‌ ఆచార్య ఎన్‌. రజిని హాజరయ్యారు. సందర్భంగా వారు మాట్లాడుతూ సాంకేతిక విద్యను అభ్యసిస్తున్న విద్యార్థినిలు విద్యుత్‌ తో పాటు సంగీత సాంస్కతిక నత్య కార్యక్రమాలలో పాల్గొనడం ద్వారా పూర్తిస్థాయిలో ఒత్తిడిని నివారించుకోవచ్చు అన్నారు. ఇంజనీరింగ్‌ కళాశాల డైరెక్టర్‌ ఆచార్య పి.మల్లికార్జునరావు, ఆచార్య వి.సరిత విద్యార్థినులను అభినందించారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన కన్వీనర్‌ గా ఆర్‌. ప్రియదర్శిని, కో-కన్వీనర్‌ టి.పల్లవి, ఫ్లాష్‌ మాబ్‌ సంబంధించిన ఉపాధ్యాయ కమిటీ సభ్యులు, ఉపాధ్యాయ సమన్వయకర్తలు వి.సరస్వతి బారు (సిఎస్‌ఈ), కె.సుశీల (ఈసిఈ), విద్యార్థిని సమన్వయకర్త వై.ప్రశాంతి (సిఎస్‌ఈ), కమిటీ సభ్యులు ఎస్‌. మంజూష (ఈసిఈ), ఈ.బిందుప్రియ (ఈఈఈ), ఎస్‌. అనిత (ఎంఈ) విద్యార్థినులతో కలసి వారి ఆనందాన్ని సంతోషాన్ని సంగీతనాదములతో అలరించారు.

➡️