ఆందోళనలతో అట్టుడికిన జిల్లాప్రభుత్వ తీరును నిరసిస్తూ రోడ్డెక్కిన కార్మికులు

ఆందోళనలతో అట్టుడికిన జిల్లాప్రభుత్వ తీరును నిరసిస్తూ రోడ్డెక్కిన కార్మికులు

ఆందోళనలతో అట్టుడికిన జిల్లాప్రభుత్వ తీరును నిరసిస్తూ రోడ్డెక్కిన కార్మికులుప్రజాశక్తి- తిరుపతి సిటి: తిరుపతి ఆధ్యాత్మిక జిల్లా. ఎప్పడు గోవింద నామాలతో ప్రతిధ్వనిస్తుంటాయి. అలాంటి ప్రాంతంలో ప్రభుత్వ నిర్లక్ష్య దోరణికి వ్యతిరేకంగా కార్మికులు రెడ్డెక్కారు. తమకు న్యాయం చేయాలని కోరుతూ ఒక పక్క అంగన్‌వాడీలు సమ్మెబాట పట్టగా ఆశా వర్కర్లు సైతం కనీస వేతనం ఇవ్వాలని కోరుతూ 36 గంటల నిరసనకు దిగారు. వరద బాధితులను ఆదుకోవాలని, రైతులకు నష్టపరిహారం ఇవ్వాలని కోరుతూ పలు రాజకీయ పార్టీలు కలెక్టరేట్‌ను ముట్టడించాయి. తమకు టైమ్‌ స్కేల్‌ ఇవ్వాలంటూ టిటిడి ఫారెస్టు కార్మికులు చేపట్టిన నిరసనదీక్ష సుమారు 1160 రోజులు దాటడం గమనార్హం. ఐసిడిఎస్‌ పరిరక్షణ కోసం, అంగన్‌వాడీలకు ఉద్యోగ భద్రత, కనీస వేతనం, పెన్షన్‌, పిఎఫ్‌, ఇఎస్‌ఐ, గ్రాట్యూటీ అమలు చేయాలని, ఇతర పెండింగ్‌ సమస్యలపై అంగన్‌వాడీలు అనేకసార్లు ప్రభుత్వానికి విన్నవించినా, ర్యాలీలు, నిరసనలు, ఆందోళనలు, వంటావార్పులు, ముట్టడి, వినతిపత్రాలు సమర్పణ వంటివి చేసిన ప్రభుత్వంలో చలనం లేదు. దీంతో విధిలేని పరిస్థితుల్లో సమ్మెబాట పట్టాల్సి వచ్చింది. అంగన్‌వాడీలకు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీ ప్రకారం తెలంగాణ కన్నా అదనంగా వేతనాలు పెంచాలి, సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం గ్రాట్యూటి ఇవ్వాలి. రిటైర్మెంట్‌ బెనిపిట్‌ 5లక్షలు, వేతనంలో సగం పెన్షన్‌ ఇవ్వాలి. హెల్పర్ల ప్రమోషన్‌లకు వయో పరిమితి 50 సంవత్సరాలు పెంచాలి, ప్రమోషన్లలో రాజకీయ జోక్యం అరికట్టాలి. 300 జనాభా దాటిన మినీ సెంటర్లను మెయిన్‌ సెంటర్లుగా మార్చాలి, వర్కర్లతో సమానంగా వేతనాలు ఇవ్వాలి. మినీ వర్కర్లకు ప్రమోషన్లు ఇవ్వాలి. వేతనంగా కూడిన మెడికల ్లఈవ్‌ సౌకర్యం కల్పించాలి. వైఎస్‌ఆర్‌ సంపూర్ణ పోషణ మెనూ ఛార్జీలు పెంచాలి. గ్యాస్‌ను ప్రభుత్వమే సరఫరా చేయాలి. పెండింగ్‌లో ఉన్న టిఏ బిల్లులు వెంటనే ఇవ్వాలి. సర్వీసులో ఉండి చనిపోయిన కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలి, బీమా అమలు చేయాలి. లబ్దిదారులకు నాణ్యమైన ఆహారాన్ని సరఫరా చేయాలి. ఆయిల్‌, కందిపప్పు కాంటిటీ పెంచాలి. సీనియార్టీ ప్రకారం వేతనాలు ఇవ్వాలి. మధ్యాహ్నాం ఒంటిలోపు కేంద్రాలను విజిట్‌ చేయరాదు. సూపర్‌వైజర్‌ పోస్టులకు వయోపరిమితి తొలగించాలనే డిమాండ్లతో వారు సమ్మెకు దిగారు. జిల్లాలో సైతం తిరుపతి కేంద్రంగా కార్పొరేషన్‌ కార్యాలయం వద్ద సమ్మెలో భాగంగా భారీస్థాయిలో నిరసన దీక్ష చేపట్టారు. దీనిపై సానుకూలంగా స్పందించాల్సిన ప్రభుత్వం కార్మికులను బెదిరింపులకు దిగడం శోచనీయం. మరో పక్క ఆశా వర్కర్లు తమ సమస్యలపై ఈ నెల 14, 15 తేదిల్లో 36 గంటల పాటు వంటావార్పు, ధర్నాకు దిగారు. జిల్లా వైద్యాధికారి కార్యాలయం ఎదుట పెద్దఎత్తున ఆందోళన చేపట్టారు. ఆశా వర్కర్లకు కనీసవేతనం చెల్లించాలి. కమ్యూనిటీ హెల్త్‌ వర్కర్లను ఆశాలకు మార్పు చేయాలి. పనిభారాన్ని తగ్గించాలి, మొబైల్‌ వర్క్‌ శిక్షణ ఇవ్వాలి. రికార్డు ఆన్‌లైన్‌, ఒక వర్కే చెల్లించాలి. ఏ కారణంతో మరణించినా 10లక్షల గ్రూప్‌ ఇన్సూరెన్స్‌ కల్పించాలి, రిటైర్‌మెంట్‌ బెనిఫిట్స్‌ 5లక్షలు ఇవ్వాలి. వేతనంలో సగం పెన్షన్‌ ఇవ్వాలి. ప్రభుత్వ సెలువులు, మెడికల్‌ లీవు, వేతనంతో కూడిన మెటర్నటీ లీవ్‌ అమలు చేయాలి. 62 సంవత్సరాలు రిటైర్మెంట్‌ జీవోను వర్తింప చేయాలి. సంక్షేమ పథకాలు అమలు చేయాలి. కోవిడ్‌ కాలంలో (2020 మార్చి నుంచి) మరణించిన ఆశాలకు 10లక్షల ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలి, కుటుంబంలో అర్హులైన వారిని ఆశాలుగా తీసుకోవాలి. ఏఎన్‌ఎం హెల్త్‌ సెక్రటరీల నియామకాల్లో ఆశాలకు వెయిటేజిని ఇవ్వాలని ఆశా వర్కర్లు ఆందోళన చేపట్టిన విషయం విధితమే. తమ సమస్యలు పరిష్కరించకపోతే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. తుపాన్‌, కరువు నష్టాలపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తీరును నిరసిస్తూ కమ్యూనిస్టుల ఆధ్వర్యంలో కలెక్టరేట్‌ వద్ద పెద్దఎత్తున ఆందోళనకు దిగి, బాధితులకు న్యాయం చేయాలని డిమాండు చేశారు. దీనికి తోడు మూడు సంవత్సరాలుకు పైగా టిటిడి అటవీ కార్మికులు తమకు టైమ్‌ స్కేల్‌ ఇవ్వాలని, కార్మికుల పట్ల వివక్షత విడనాడి, అందర్ని ఒకే విధంగా చూసి, మిగిలిన 200 మంది కార్మికులను కూడా బోర్డు తీర్మానం మేరకు రెగ్యులర్‌ చేయాలని కోరుతూ ఆందోళనను కొనసాగిస్తూనే ఉన్నారు. ఖాళీ పోస్టుల భర్తీ, ఓటరు నమోదులో అక్రమాలు అనేక అంశాలపై గడిచిన నాలుగు రోజులుగా తిరుపతి జిల్లా కేంద్రం ఆందోళనలతో అట్టుడికుతోంది. ఇప్పటికైనా ప్రభుత్వం, అధికారులు స్పందించి కార్మికుల న్యాయమైన కోర్కెలను పరిస్కరించాలని పలువురు కోరుతున్నారు. సమస్య వచ్చినప్పడు పరిష్కరించాలే కాని, అధికారదర్పంతో జఠిలం చేయకుడదని హితవు పలికారు.

➡️