ఆదమరిస్తే అంతే !భారీ గుంతలతో భయాందోళన

ఆదమరిస్తే అంతే !భారీ గుంతలతో భయాందోళన

ఆదమరిస్తే అంతే !భారీ గుంతలతో భయాందోళనప్రజాశక్తి -రేణిగుంట: రేణిగుంట పాత చెక్‌పోస్టు సమీపంలోని కెనరా బ్యాంక్‌ ఎదురుగా రోడ్డు మధ్యలో భారీ గుంత ఏర్పడింది. మిచౌంగ్‌ తుపాన్‌ ప్రభావంతో భారీగా కురిసిన వర్షాలకు రోడ్లమీద వర్షపు నీరు నిలిచింది. ఆ మార్గంలో వాహనాలు రాకపోకలు జరగడంతో భారీగా గుంత ఏర్పడింది. ఆ గుంత కాస్త పెద్దదిగా మారి ప్రమాదకరంగా మారింది. ద్విచక్ర వాహనదారులు కార్లు, ఆటోలు ఆది మరచి ప్రయాణిస్తే భారీ ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. అధికారులు తక్షణం స్పందించి ఆ రోడ్డుపై ఉన్న గుంతకు మరమ్మతులు చేపట్టి వాహనదారులకు రక్షణ కల్పించాలని పలువురు కోరుతున్నారు.

➡️