ఆశా వర్కర్ల నిర్బంధం అన్యాయం

ఆశా వర్కర్ల నిర్బంధం అన్యాయంప్రజాశక్తి – గూడూరు టౌన్‌ ఛలో విజయవాడ ఆశా వర్కర్లు కార్యక్రమానికి వెళ్లేందుకు బుధవారం సాయంత్రం గూడూరు రైల్వే స్టేషన్‌ కు చేరుకొన్న వెంకటగిరి, సూళ్లూరుపేట కి చెందిన ఆశా వర్కర్లును బుధవారం సాయంత్రం గూడూరు పోలీసులు గుర్తించి అరెస్టు చేసి సమీపంలో వన్‌ టౌన్‌ పోలీస్‌ స్టేషన్‌ కు తరలించారు. సమాచారం తెలుసుకున్న గూడూరు సి.పి.ఎం., సి.ఐ.టి.యు నాయకులు వెంటనే పోలీస్‌ స్టేషన్‌ కి వెళ్లి పోరాటాలపై నిర్బంధం అన్యాయమని, మహిళలను అర్ధరాత్రి వేళ అరెస్టు చేసి కుటుంబాల్లో టెన్షన్‌ వాతావరణాన్ని సృష్టించరాదని సూచించారు.

➡️