ఆ ఆర్‌ఐ రూటే సప’రేట్‌’

Jan 25,2024 22:45
ఆ ఆర్‌ఐ రూటే సప'రేట్‌'

కాళ్లు పట్టుకున్నా కనికరం లేదుపట్టా ఉన్నా పట్టించుకోని వైనంప్రజాశక్తి – తొట్టంబేడు ఆ ఆర్‌ఐ రూటే సపరేట్‌. ఆయన చెప్పిందే వినాలి.. లేదంటే సొంత పట్టా భూమిలో ఇల్లు కట్టుకున్నా కూలదోస్తూ పేదలను భయభ్రాంతులకు గురిచేస్తున్నాడన్న ఆరోపణలు ఉన్నాయి. కాకులను కొట్టి గద్దలకు పంచుతున్నారన్న చందంగా పేదల పొట్టగొట్టి కబ్జాదారుల కొమ్ముకాస్తున్నారన్న విమర్శలు అతనిపై దండిగా ఉన్నాయి. కాసులు ఇస్తే పట్టా పక్కా అవుతుంది. ఇవ్వకపోతే ఒరిజినల్‌ పట్టా ఉన్నా నకిలీదవుతుంది. ఎటువంటి డాక్యుమెంట్లు లేకపోయినా ముడుపులు ఇస్తే చాలు ఎంచక్కా ఇళ్లు కట్టేసుకోవచ్చు. బాధితుల వివరాల మేరకు…తొట్టంబేడు మండలంలోని శివనాధపురం సమీపంలో శ్రీకాళహస్తి- పిచ్చాటూరు రోడ్డు కు ఆనుకొని వి.గిరిజమ్మ వద్ధురాలికి ఇందిరమ్మ ఇల్లు ఉంది. సీఎం జగన్మోహన్‌ రెడ్డి ప్రవేశపెట్టిన ఓటిఎస్‌ పథకం కింద రిజిస్ట్రేషన్‌ చేసి ఇచ్చారు. అయితే కొంతమంది బడా నాయకులు ఆమె ఇంటి ముందర కడగాలు తీసి ఇబ్బంది పెడుతున్నారని వారం రోజులుగా రెవిన్యూ కార్యాలయం చుట్టూ తిరిగినా ప్రయోజనం లేకుండా పోయిందని వాపోయింది. సమస్య ఉందని చెప్పిన పట్టించుకోని ఆ అధికారి గురువారం మధ్యాహ్నం ఆ వైపుగా వెళుతుంటే ‘నిరుపేదలు మాగోడు పట్టించు కొండి మహా ప్రభు’ అంటూ వెంట పరిగెత్తారు. ఎట్టకేలకు వారిని చూసి ఆయన ఏమి పరుగులు తీస్తున్నారని హేళనగా మాట్లాడారు. డాక్యుమెంట్స్‌ తీసుకొని రెవెన్యూ కార్యాలయానికి రమ్మన్నారు. వద్ధురాలు గిరిజమ్మ మీ దగ్గరకే వారం రోజులుగా తిరుగుతున్నానని ఆవేదన వ్యక్తం చేసింది. పాత్రికేయలను చూసి ఆగిన ఆర్‌ఐ మొక్కుబడిలా బడా బాబులు ఆక్రమించిన కడగాలు తీసి ఉంటే వాటిని పూడ్చారు. ఆయన వెళ్లిన వెంటనే యథేచ్ఛగా కట్టడాలు మొదలుపెట్టారు.మా ఇల్లు మమ్మల్ని నిర్మించుకోని మహాప్రభుశ్రీకాళహస్తి పట్టణంలోని భాస్కర్‌ పేటకు చెందిన రుక్మిణికి 2009లో ఇందిరమ్మ హౌసింగ్‌ కింద రాజీవ్‌ నగర్‌ లో 335వ ఫ్లాట్‌ మంజూరు చేశారు. ఈమెకు ఒరిజినల్‌ పట్టా ఉన్నా ఆ రెవెన్యూ అధికారి ఇంటి పనులు చెయ్యనీయడం లేదు. గత మూడు నెలలుగా ఆయన చుట్టూ ప్రదర్శనలు చేస్తున్నామని వాపోయింది. పట్టా ఉన్నా పైసలు ఇవ్వలేదని ఆమెను ఇబ్బంది పెడుతున్నారని పాత్రికేయులతో వాపోయింది. నా ఇల్లు కూలిస్తే ప్రాణాలు తీసుకుంటా తొట్టంబేడు మండలంలోని కొత్త కండ్రిక గ్రామానికి చెందిన ఎం. బాబు దళితుడు. గత 20 సంవత్సరాలుగా గుడిసె వేసుకుని కాపురం ఉంటున్నాడు. బడా బాబుల కనుసన్నల్లో విధులు నిర్వహిస్తున్న ఆర్‌ఐ బాబు ఇల్లు కూల్చడానికి ప్రయత్నించాడు. దీంతో నిలువ నీడ లేక గుండెలు బాదుకున్నాడు.తన ఇల్లు కూలిస్తే తనకు చావే శరణ్యమని వాపోయాడు. కాళ్లు పట్టుకున్న కనికరించనీ ఆర్‌ ఐ వాళ్లని చివాట్లు పెట్టి వెళ్లిపోయాడు.

➡️