ఇంటిపట్టాలిచ్చి ‘పుణ్యం’ కట్టుకోండి!

ఇంటిపట్టాలిచ్చి 'పుణ్యం' కట్టుకోండి!

ఇంటిపట్టాలిచ్చి ‘పుణ్యం’ కట్టుకోండి!ప్రజాశక్తి – రేణిగుంట రేణిగుంట మండలం కరకంబాడి పంచాయతీలోని గుట్టపై పది రోజులుగా ఎండల్లో ఎండుతూ, చలికి వణుకుతూ ఉన్నామని, పాలకులు, అధికారులు ఇంటి పట్టాలిచ్చి పుణ్యం కట్టుకోవాలని పేదలు వాపోతున్నారు. గురువారం వేలాది మంది గుడారాల వద్దనే నిరసన తెలిపారు. ఈ సందర్భంగా సిపిఎం మాజీ వార్డు మెంబర్‌ సత్యశ్రీ మాట్లాడుతూ జగనన్న పాలన వచ్చి నాలుగున్నరేళ్లు దాటినా ఇంటి జాగా చూపించలేదన్నారు. ఇంటి పట్టా ఇచ్చి జాగా చూపించకుండా పేదలను మోసం చేశారన్నారు. ఇల్లు లేని నిరాశ్రయులు వేలాదిగా ఉన్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. దరఖాస్తు చేసిన వెంటనే ఇంటి జాగా చూపిస్తామని చెబుతున్న పాలకులకు తమ గోడు వినిపించదా? అని ప్రశ్నించారు. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే వెంటనే ఇక్కడున్న నాలుగువేల మందికి ఇంటిపట్టాలు ఇప్పించాలని డిమాండ్‌చేశారు.

➡️