ఉత్సాహం.. ప్రోత్సాహం.. బాలోత్సవం29 విభాగాల్లో పోటీలు..5వేల మందికి పైగా హాజరు

ఉత్సాహం.. ప్రోత్సాహం.. బాలోత్సవం29 విభాగాల్లో పోటీలు..5వేల మందికి పైగా హాజరు

ఉత్సాహం.. ప్రోత్సాహం.. బాలోత్సవం29 విభాగాల్లో పోటీలు..5వేల మందికి పైగా హాజరుప్రజాశక్తి- తిరుపతి సిటిపిల్లలను ప్రోత్సహించేందుకు, వారిలోని ప్రతిభను వెలికితీసేందుకు తిరుపతి బాలోత్సవం ఆధ్వర్యంలో నిర్వహించిన పిల్లల పండుగకు వేలాది మంది విద్యార్థులు ఉత్సాహం హజరయ్యారు. తిరుపతి పండిట్‌ జవహర్‌ లాల్‌నెహ్రు మున్సిపల్‌ హైస్కూల్‌ రోటరీక్లబ్‌ సౌజన్యంతో తిరుపతి బాలోత్సవం ఆధ్వర్యంలో పిల్లల పండుగ-2 శనివారం ఘనంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి టిటిడి చైర్మన్‌, తిరుపతి ఎంఎల్‌ఏ భూమన కరుణాకర్‌రెడ్డి, కార్పొరేషన్‌ మేయర్‌ డాక్టరు శిరీషా ముఖ్యఅతిథులుగా హజరయ్యారు. చాచా నెహ్రు సభా వేదికపై ఈసందర్భంగా తిరుపతి బాలోత్సవం గౌరవధ్యక్షులు టెంకాయల దామోదరం అధ్యక్షతన జరిగిన సభనుద్దేశించి ఎంఎల్‌ఏ భూమన మాట్లాడుతూ పిల్లలను ప్రోత్సహించేందుకు ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమని అన్నారు. రెండు రోజుల పాటు జరిగే ఈ కార్యక్రమాల్లో పిల్లలు ఆనందంగా పాల్గొని, విజేయులు కావాలని ఆకాంక్షించారు. తిరుపతి కార్పొరేషన్‌ మేయరు డాక్టరు శిరీషా మాట్లాడుతూ తిరుపతి బాలోత్సవం ఆధ్వర్యంలో గత ఏడాది కూడా పిల్లల పండగ నిర్వహించారని, ఈ ఏడాది దాని కంటే ఎక్కువ స్థాయిలో విద్యార్థుల హజరయ్యారన్నారు. ప్రస్తుత కాలంలో పిల్లలకు చదువులు, ర్యాంకులే ప్రాధాన్యతగా మారాయన్నారు. చదువులతో పాటు క్రీడలు, ఇతర రంగాల్లో కూడా రాణించాలని విద్యార్థులకు సూచించారు. ఈ పిల్లల పండుగలో విద్యార్థులు తమ సామార్ధాన్ని చాటాలని పిలుపునిచ్చారు. రోటరీ క్లబ్‌ అధ్యక్షులు రాజ్‌కుమార్‌ మాట్లాడుతూ నిర్వాహకులు ఇలాంటి కార్యక్రమాలు ఎంచుకోవడం అబినందనీయమని అన్నారు. కమిటీ సభ్యులందరూ అన్ని స్కూల్స్‌కు తిరిగి వారిలో ఈ పోటీలపై ఆసక్తిని పెంచారన్నారు. పోటీలు అన్నాక జయోపజయాలు సాధారణమని, వాటిని పక్కనపెట్టి మీలోని నైపుణ్యతకు పదుపుపెట్టాలని విద్యార్థులకు సూచించారు. అనంతరం చాచా నెహ్రు వేదిక వద్ద చిత్రలేఖనం, గోపికృష్ణ వేదికపై శాస్త్రీయ కళా ప్రదర్శనలు, గురుజాడ వేదికపై దేశభక్తి గీతాలాపన, అన్నమయ్య వేదికపై జానపద నృత్యప్రదర్శనలు, బళ్ళారి రాఘవ వేదికై ఏకపాత్రాభినయం వంటి వాటితో పాటు పలు వేదికల నుంచి అనేక పోటీలను నిర్వహించారు. 29 విభాగాల్లో నిర్వహించిన ఈ పోటీలకు 100కు పైగా స్కూల్స్‌ నుంచి 5వేల మందికిపైగా విద్యార్థులు హజరయ్యారు. షెడ్యూల్‌ ప్రకారం న్యాయమూర్తుల ఎదుట పారదర్శికంగా నిర్వహించిన పోటీల్లో విద్యార్థులు ఉల్లాసంగా, ఉత్సాహంగా పాల్గొన్నారు. వేలాదిగా తరలివచ్చిన విద్యార్థులు, వారి తల్లిదండ్రులతో ప్రాంగాణం మొత్తం కిక్కిరిసిపోయింది. బాలోత్సవం అధ్యక్షులు నడ్డా నారాయణ, కార్యదర్శి మల్లారపు నాగార్జున, కార్పొరేటర్‌ గీత, ఎస్‌పిజెఎన్‌ఎంహెచ్‌ స్కూల్‌ హెచ్‌ఎం మునిశేఖర్‌, ఎంఈవోలు బాస్కర్‌ నాయక్‌, బాలాజీ, బండి మధుసూధనరెడ్డి, సుజాత, ముఖేష్‌, రెడ్డెప్ప విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ఒక వేదికపై వేలాదిమంది విద్యార్థులు తిరుపతి(మంగళం): నేడు పోటీ ప్రపంచంలో విద్యార్థుల మానసిక ఎదుగుదల ప్రశ్నార్ధకంగా మారిన నేపథ్యంలో పిల్లల్లో సహజ వికాసం, నూతన ఆలోచనలకు తిరుపతి బాలోత్సవం వేదికగా మారింది. ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల విద్యార్థులు తమలో ఉన్న ఆలోచనలతో పాటుగా ఇతర విద్యార్థుల ఆలోచనలను పంచుకోవడానికి బాలోత్సవం దోహదపడుతోంది. వేలాది మంది విద్యార్థులు ఒక వేదికపై దాదాపు 29 రకాల పోటీలలో పాల్గొని వారి మానసిక వికాసానికి మరింత మెరుగైన ఆలోచనలు చేయడానికి అవకాశం ఏర్పడింది. బాలోత్సవం గురించి ఉపాధ్యాయులు, విద్యార్థులు, విద్యార్థుల తల్లిదండ్రులు ”ప్రజాశక్తి”తో పంచుకున్న అనుభవాలు వారి మాటల్లోనే…..తల్లిదండ్రుల పర్యవేక్షణ ఉండాలి- సోమేశ్వర్‌ బండ్ల, సంకల్ప హాస్పిటల్‌ డైరెక్టర్‌ నేడు టెక్నాలజీతో కూడుకున్న విద్యను అభ్యసించడానికి చాలావరకు సెల్‌ ఫోన్స్‌ వినియోగిస్తున్నారు. విద్యార్థులకు అవసరమైన మేరకు తప్ప సెల్‌ఫోన్‌ వినియోగం చేయకుండా తల్లిదండ్రులు పర్యవేక్షణ చేయాలి. బాలోత్సవం కార్యక్రమానికి తమ వంతుగా సంకల్ప హాస్పిటల్‌ వైద్య సేవలను అందుబాటులో ఉంచాం.నీతి పద్యాలకు సమయం ఉండేది- నడ్డి నారాయణ, బాలోత్సవం అధ్యక్షులు గతంలో విద్యార్థులకు మానవీయ విలువలు పెంపొందడానికి ఉపాధ్యాయులు నీతి పద్యాలు చెప్పడానికి ఒక సమయాన్ని ఏర్పాటు చేసేవారు. కాలానుగుణంగా టెక్నాలజీ పుణ్యమా అని బాలల్లో వికాసం గాడి తప్పుతోంది. వాటి నుంచి పిల్లల్లో మానవీయ విలువలు, నీతి అలవర్చుకునేలా బాలోత్సవం ప్రయత్నం మొదలు పెట్టింది.కొత్త ఆలోచనలకు వేదిక- బండి మధుసూదన్‌ రెడ్డి, యుటిఎఫ్‌ తిరుపతి జిల్లా కార్యదర్శి.పిల్లల్లో కొత్త ఆలోచనలకు వేదికగా బాలోత్సవం ఉపకరిస్తుంది. ఒకే వేదికపై ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల విద్యార్థులు కలుస్తున్నారు. ఇది సమానత్వానికి, విద్యార్థుల మధ్య అంతర భయాన్ని పోగొడుతుంది. ఒకరి ఆలోచనలు మరొకరు నేర్చుకోవడానికి బాలోత్సవం అవకాశం కల్పిస్తోంది. టెక్నాలజీతో కూడిన బోధన- వై.హేమాద్రి బాబు, యుటిఎఫ్‌ తిరుపతి నగర అధ్యక్షులురాష్ట్ర ప్రభుత్వం బాల్య దశ నుండి నూతన టెక్నాలజీతో విద్యాబోధన చేయాలని, వాటికి తగిన సదుపాయాలను పాఠశాలలు ఏర్పాటు చేయడం హర్షించదగింది. కరోనా తరువాత విద్యార్థులు టెక్నాలజీలో ఒక అడుగు ముందుగానే ఉన్నారనే చెప్పాలి. వారి ఆలోచనలు వేగంగా మారాయి.నేడు క్రీడల పట్ల ఆసక్తి చూపట్లేదు- పి.విజయ కుమారి, స్కూల్‌ గేమ్స్‌ తిరుపతి జిల్లా కార్యదర్శినేటితరం విద్యార్థులు కాలానుగుణంగా కనుమరుగవుతున్న క్రీడల పట్ల ఆసక్తి చూపట్లేదు, వాటిని పూర్తిగా మరిచిపోతుండగా బాలోత్సవం వాటిని తిరిగి పిల్లల ముందు ప్రదర్శించడం జరుగుతుంది. సాధారణ క్రీడలతో మానసిక ఉల్లాసంతో పాటు, కొన్ని క్రీడలు బాల్య దశ నుండి ఉన్నత లక్ష్యాలకు చేరుకునేలా చేస్తుంది. వాటిని బాలోత్సవం ద్వారా పిల్లలకు పరిచయం చేస్తున్నాం. బాలోత్సవంతో మనోవికాసంతో పాటు క్రీడా వికాసం ఏర్పడుతొంది.బాలోత్సవం చాలా బాగుంది- బి.జాహ్నవి, 5వ తరగతి, ఎస్‌ఆర్‌ ఇంగ్లీష్‌ మీడియం స్కూల్‌నేను బాలోత్సవంకు రావడం చాలా సంతోషంగా ఉంది. చాలా పాఠశాలల నుండి విద్యార్థులు కలుసుకున్నాం. మా పాఠశాలలో లేని స్పెల్‌ బి పోటీలలో పాల్గొన్నాను. బాలోత్సవం నిర్వహించిన పోటీల్లో నేను నెమలి బొమ్మను గీసాను.వినోదంతో పాటు విజ్ఞానం- కె. స్రవంతి, విద్యార్థిని తల్లి, కొర్లగుంట, తిరుపతిబాలోత్సవం ద్వారా పిల్లల్లో వినోదంతో పాటు విజ్ఞానం పొందే అవకాశం వచ్చింది. రెండు రోజులపాటు వారి మోత బరువుకు రిలాక్సేషన్‌ దొరికింది. బాలోత్సవం ద్వారా మనోవికాసంగా పిల్లలు ఎదుగుతారు. ఒక విద్యార్థిని తల్లిగా చెబుతున్న చాలా బాగుంది. ఒకే వేదికపై పలురకాల టాలెంట్లు చూడగలిగే అవకాశం కలిగింది.తెలుగు భాషను కాపాడడానికి- నెమిలేటి కిట్టన్న, తెలుగు ఉపాధ్యాయులు, మంగళం ట్రెండ్స్‌ పాఠశాలనేడు తెలుగు వింపడకూడదు, కనపడకూడదు అన్నట్లుంది పరిస్థితి. అయినా తెలుగు భాషను బతికించుకోవడానికి, అనేక సంస్థలు పుట్టుకొచ్చాయి. అందులో భాగంగా ‘తిరుపతి బాలోత్సవం’ సంస్థ ఏర్పడి పిల్లల్లోని సజనత్మాకతను వెలికి తీసి, ఎప్పుడు మార్కులు, ర్యాంకులేనా కూసింతైనా అటవీడుపు అందులోనువారి వారిలోని సజనను వెలికి తీయడానికి ఇది ఒక సదవకాశం. స్మార్ట్‌ ఫోన్లో పిల్లల భవితవ్యం ప్రశ్నార్ధకంగా మారుతున్న వేళ ఈబాలోత్సవం పిల్లల మానసిక వికాసానికి, మూర్తిమత్వం నిర్మాణానికి ఎంతగానో తోడ్పాటునందించింది.

➡️