ఉన్నత విద్యా మండలి బోర్డ్‌ ఆధ్వర్యంలో నూతన విద్యార్థినులకు శిక్షణ

Jan 24,2024 23:13
ఉన్నత విద్యా మండలి బోర్డ్‌ ఆధ్వర్యంలో నూతన విద్యార్థినులకు శిక్షణ

ప్రజాశక్తి -క్యాంపస్‌: శ్రీపద్మావతి మహిళా విశ్వవిద్యాలయంలో ఉన్నత విద్యామండలి బోర్డ్‌ ఆఫ్‌ కమ్యూనిటీ డెవలప్మెంట్‌ త్రు ఎడ్యుకేషన్‌ యూనిసెఫ్‌ లర్నింగ్‌ ఇంప్రూవ్మెంట్‌ ప్రోగ్రాం శిక్షణ ధతి సమావేశ మందిరంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఏపీఎస్సిహెచ్‌ఈ చైర్మన్‌ ప్రొఫెసర్‌ హేమ చంద్రా రెడ్డి, ఉపకులపతి ఆచార్య డి.భారతి ముఖ్యఅతిధులుగా హాజరయ్యారు. ఉన్నత విద్యామండలి బోర్డ్‌ ఆఫ్‌ కమ్యూనిటీ డెవలప్మెంట్‌ త్రు ఎడ్యుకేషన్‌ యూనిసెఫ్‌ లర్నింగ్‌ ఇంప్రూవ్మెంట్‌ ప్రోగ్రాం ద్వారా రాష్ట్రస్థాయిలో ఉన్నటువంటి ఉన్నత విద్యాసంస్థలలో చదువుతున్న విద్యార్థులు చదువుతోపాటు సమాజసేవలో పాల్గొని సమాజంతో మమేకమై సామాజిక సేవ చేయడమన్నారు. దీంట్లో భాగంగా విద్యార్థులు రెండు నెలల పాటు ఊరిలో ఉన్నటువంటి ప్రైమరీ స్కూల్‌కు వెళ్లి 10 నుండి 15 మంది పిల్లలను గుర్తించి వారికి నుంచి నేర్పించి ప్రోత్సహించటం జరుగుతోందన్నారు. ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టడానికి ముఖ్య కారణం సర్వేలు ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్నటువంటి పిల్లల లర్నింగ్‌ లెవెల్స్‌ చాలా తక్కువగా ఉండడం అన్నారు. ఐదు ఆరు తరగతుల విద్యార్థులకు రాయడం రాకపోవడం భవిష్యత్తులో దీని పరిణామాలు తీవ్రంగా ఉంటుందని దాని కొరకు పరిష్కారం దిశగా ఈప్రయత్నం జరుగుతోందన్నారు. శ్రీపద్మావతి మహిళా విశ్వవిద్యాలయంలో చదువుతున్న విద్యార్థినులు ఎల్‌ఐపి ప్రోగ్రాంను వారివారి స్వగ్రామాలలో పూర్తి చేయడానికి అవసరమైన శిక్షణని బిసిడిఈ కన్సల్టెంట్స్‌ సిమ్రాన్‌ అండ్‌ తనుశ్రీ అందించారు. ఈ సమావేశంలో విద్యార్థినులకు హేమచంద్రరెడ్డి ఎంతగానో ప్రోత్సహించారు. దేవకుమార్‌-సెక్రటరీ సీఈఓ బిసిడిఈ, ప్రొఫెసర్‌ జె.కాత్యాయని బిసిడిఈ డైరెక్టర్‌, ప్రొఫెసర్‌ కిషోరి, డాక్టర్‌ ఎన్‌.శ్రీరజని, బి.విజయభాస్కర్‌ జాయింట్‌ డైరెక్టర్‌ సమగ్ర శిక్ష, యూనిసెఫ్‌ అధికారులు శేషగిరి మధుసూదన్‌, వి.స్వాతిదేవ్‌, కల్పనా నోడల్‌ ఆఫీసర్‌, రమా డైరెక్టర్‌ శిక్షణ ఫౌండేషన్‌ పాల్గొన్నారు.

➡️