ఎన్నికల నియమావళి అనుసరించాలి : కలెక్టర్‌

ఎన్నికల నియమావళి అనుసరించాలి : కలెక్టర్‌

ఎన్నికల నియమావళి అనుసరించాలి : కలెక్టర్‌ప్రజాశక్తి – తిరుపతి టౌన్‌రానున్న సార్వత్రిక ఎన్నికలు 2024కు సంబంధించి వివిధ రాజకీయ పార్టీలు ఎన్నికల ప్రవర్తనా నియమావళిని తప్పక అనుసరించాలని, ఎన్నికల సన్నద్ధతపై అన్ని ఏర్పాట్లు చేపడుతున్నామని కలెక్టర్‌, జిల్లా ఎన్నికల అధికారి డాక్టర్‌ జి. లక్ష్మీ శ అన్నారు. బుధవారం జిల్లా కలెక్టరేట్‌లోని మినీ సమావేశ మందిరం నందు కలెక్టర్‌ ఆధ్వర్యంలో క్లెయిమ్స్‌ అండ్‌ అబ్జెక్షన్స్‌, ఎన్నికల సన్నద్ధత పై గుర్తింపు పొందిన రాజకీయ పార్టీ నాయకులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. కలెక్టర్‌ మాట్లాడుతూ జిల్లాలోని అన్ని నియోజకవర్గాల పరిధిలోని పోలింగ్‌ కేంద్రాలలో మౌలిక సదుపాయాలు కల్పించామని, అయినప్పటికీ మరొకసారి ఈఆర్‌ఓ లు సరి చూసుకోవాలని తెలిపారు. సిఈఓ వారి అనుమతించిన ఓటరు జాబితా నుండి తొలగింపులు నియోజక వర్గాల వారీగా 120-గూడూరు 538, 121-సూళ్లూరుపేట 605, 122-వెంకటగిరి 744, 166-చంద్రగిరి 1680, 167-తిరుపతి 856, 168-శ్రీకాళహస్తి 571, 169-సత్యవేడు 76 అనుమతి సూచనలు అందాయని తెలిపారు. సార్వత్రిక ఎన్నికలు 2024 లో వినియోగించే వాటికి జిల్లా ఎన్నికల అధికారి తిరుపతి వారి ద్వారా నిర్ధారించిన ధరల పట్టిక రాజకీయ పార్టీల ప్రతినిధులకు అందించి వివరించారు. వివిధ రాజకీయ పార్టీలు, ఎన్నికల అభ్యర్థి వారు ఎన్నికల ప్రవర్తనా నియమావళిని తప్పక అనుసరించాలని సూచించారు. ఎన్నికల కమిషన్‌ నిబంధనల మేరకు నిష్పాక్షిక ఎన్నికల నిర్వహణకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నామని కలెక్టర్‌ తెలిపారు. డిఆర్‌ఓ పెంచల కిషోర్‌, ఈఆర్‌ఓ లు అదితి సింగ్‌, చంద్రముని, నిషాంత రెడ్డి, కిరణ్‌ కుమార్‌, రవి శంకర్‌ రెడ్డి పాల్గొన్నారు.

➡️