ఎఫ్‌ఎంఎస్‌లను తొలగించేందుకు టిటిడి కుట్ర

Jan 28,2024 22:54
ఎఫ్‌ఎంఎస్‌లను తొలగించేందుకు టిటిడి కుట్ర

శ్రీ కొత్త నిబంధనల పేరుతో సీనియర్లను జులక్‌శ్రీ చైర్మన్‌ ఆదేశాలను పట్టించుకోని అధికారులుప్రజాశక్తి- తిరుపతి సిటి: టిటిడి ధార్మిక సంస్థలో పనిచేస్తున్న ఎఫ్‌ఎంఎస్‌లను తొలగించేందుకు టిటిడి యాజమాన్యం కొత్త నిబంధనలు తీసుకొచ్చింది. ఏళ్ల తరబడి పని చేస్తున్న సీనియర్‌ కార్మికులకు జులక్‌ ఇచ్చి, సాగనంపే కుట్రకు తెరలేపింది. ఎన్నికల వేళ ఇది సరైనది కాదని సాక్షాత్తు టిటిడి చైర్మన్‌ ఆదేశించిన అధికారులు నిమ్మకునీరెత్తినట్లు వ్యవహరించడం గమనార్హం. విధిలేని పరిస్థితుల్లో కార్మికులు పోరాటాలకు నడుంబిగించారు. ఉద్వాసనలకు తెరవేయకపోతే ఉద్యమాలను ఉధృతం చేస్తామని హెచ్చరిస్తున్నారు.టిటిడి ఓ దార్మిక సంస్థ. శ్రీవారి దర్శనార్ధం నిత్యం లక్షలాది మంది యాత్రికులు రాకపోకలు సాగిస్తుంటారు. ఆలయ పరిసరాలు, తిరుమల క్షేత్రాన్ని పరిశుభ్రంగా పెట్టడంలో ఎప్‌ఎంఎస్‌లే కీలకం. తమ ఆరోగ్యాలను పనంగా పెట్టి, చాలీచాలనీ జీతాలతో నిరుపేద కుటుంబాలకు చెందిన వారు శ్రీవారి భక్తులకు సేవ చేస్తున్నారు. టిటిడి హెల్త్‌ విభాగంలో సుమారు 7వేల మంది ఎప్‌ఎంఎస్‌ కార్మికులు ఏళ్ల తరబడి పని చేస్తున్నారు. అనేక పోరాటల ఫలితంగా టిటిడి జీతాలు పెంచింది. కానీ పెరిగిన జీతాలు తీసుకోకనే టిటిడి టెండర్లలో కొత్త నిబంధనలు పెట్టి కలంపోటుతో కార్మికుల పొట్టగొట్టి బ్రతుకు లేకుండా చేయాలని టిటిడి నిర్ణయించింది. టిటిడిని నమ్ముకుని ఏళ్ల తరబడి చాలీ, చాలని జీతాలతో, కరోనాలో కూడా ప్రాణాలు లెక్కచేయకుండా సేవలందించిన కార్మికుల పట్ల, వయస్సు మీరిన పశువులను యాజమాని వదిలించుకున్నట్లు టిటిడి కూడా ఆదే దోరణితో 45 సంవత్సరాలు పైబడిన కార్మికులను విధుల నుంచి తొలగించి, వారి జీవితాలను నాశనం చేయాలనుకోవడం ధర్మామా..?. టిటిడి హెల్త్‌ విభాగంలో కొత్త నిబంధనల ప్రకారం 45 సంవత్సరాల లోపు ఉన్నవారినే విధుల్లోకి తీసుకోవాలి, అందులో 30శాతం మహిళలు, 70శాతం పురుషులు ఉండాలి. సూపర్‌వైజర్లకు శానీటేషన్‌ సర్టిఫికెట్‌ ఖచ్చితంగా ఉండాలని నిబంధన పెట్టడం దారుణం. దీని వల్ల ఏళ్ల తరబడి సేవలందించిన కార్మికులు ఇంటిదారిన పట్టాల్సిన పరిస్థితి. ధర్మోరక్షిత రక్షత: అన్న నినాదంతో నడిచే టిటిడి ఇలాంటి అధర్మానికి పాల్పడడం ఘోరమని కార్మిక వర్గం ఆవేధన చెందుతోంది. ఛైర్మన్‌ చెప్పిన స్పందించిన అధికారులు ఎఫ్‌ఎంఎస్‌, హెల్త్‌ టెండర్లలో కార్మికులు పొట్టకొట్టే కొత్త నిబంధనలు మార్చాలని 20 రోజుల క్రితం సిఐటియు ఆధ్వర్యంలో ఎప్‌ఎంఎస్‌ కార్మికులు టిటిడి చైర్మన్‌ భూమన కరుణాకర్‌రెడ్డికి వినతిపత్రం సమర్పించారు. కొత్త నిబంధనలు రద్దు చేసి, కార్మికులను తొలగించకుండా చర్యలు తీసుకోవాలని సబంధిత చీప్‌ ఇంజనీర్‌ని ఆదేశించారు. చైర్మన్‌ చెప్పిన టిటిడి యాజమాన్యం కొత్త నిబంధనలు మార్చకపోవడం అన్యాయం. చైర్మన్‌ ఆదేశాలను కూడా పట్టించుకోరా అని కార్మికులు ప్రశ్నిస్తున్నారు. కార్మికులకు న్యాయం జరిగేలా చైర్మన్‌ చర్యలు తీసుకోవాలని ఎఫ్‌ఎంఎస్‌లు వేడుకుంటున్నారు. టిటిడి అటవీ కార్మికులకు మద్దతుగా …నేడు జిల్లా అంతటా ధర్నాలు : సిఐటియు పిలుపుప్రజాశక్తి – తిరుపతి: ఆమరణ నిరాహార దీక్షలో ఉన్న కందారపు మురళి, ఇతర కార్మిక నేతల పరిస్థితి క్షీణించటం.. టిటిడి బోర్డు సమావేశం సోమవారం జరుగుతున్న నేపథ్యంలో జిల్లా అంతటా అన్ని మండల కేంద్రాలలో ధర్నా కార్యక్రమాలు నిర్వహించాలని సిఐటియు జిల్లా అధ్యక్షులు జి. బాలసుబ్రమణ్యం పిలుపునిచ్చారు. సిఐటియు అనుబంధ సంఘాలు, అన్ని కార్మిక ప్రజాసంఘాల నేతలు జిల్లా వ్యాప్తంగా పెద్ద ఎత్తున ధర్నాలు నిర్వహించాలని శ్రేణులను కోరారు.నిబంధనలు మార్చే వరకు పోరాటం టెండర్లలో పెట్టిన కొత్త నిబంధనలు మార్చే వరకు పోరాటాలు ఉదృతం చేయాలని సిఐటియు ఆధ్వర్యంలో టిటిడి ఎప్‌ఎంఎస్‌, హెల్త్‌ కాంట్రాక్టు వర్కర్స్‌ యూనియన్‌ నిర్ణయించింది. ఈనెల 28వ తేది నుంచి టిటిడి పరిపాలన భవనం వద్ద భారీ నిరసననకు పూనుకుంది. 29వ తేదీ జరిగే టిటిడి పాలకమండలి సమావేశంలో తమ సమస్యలకు పరిష్కరించాలని, లేని పక్షలో కార్మికులందరు విధులు బహిస్కరించి, ఆందోళనలు మరింత ఉధృతంగా నిర్వహించేందుకు సిద్ధమయ్యారు. ఇప్పటికైనా టిటిడి యాజమాన్యం స్పందించి హెల్త్‌ టెండర్లలో కొత్త నిబంధనలు రద్దు చేసి, ఏళ్లతరబడి పని చేస్తున్న కార్మికులు న్యాయం చేయాలని పలు ప్రజా,కార్మిక సంఘాలు కోరుతున్నాయి. ఎఫ్‌ఎంఎస్‌ సమస్యలు- టిటిడి ఎఫ్‌ఎంఎస్‌, హెల్త్‌టెండర్లలో 18 సంవత్సరాల నుండి 45 సంవత్సరాల లోపు ఉన్న కార్మికులను తీసుకోవాలని పెట్టిన నిబంధన తొలగించాలి. ప్రస్తుతం పనిచేస్తున్న కార్మికులను యథావిధిగా కొనసాగించాలి.- మహిళ కార్మికులు 30 శాతం, పురుషులు 70శాతం అన్న నిబంధనను తొలగించాలి.-ఎఫ్‌ఎంఎస్‌ విభాగంలో సూపర్‌వైజర్లకు శానిటేషన్‌ సర్టిఫికెట్‌ ఇవ్వాలని పెట్టిన నిబంధనను తొలగించాలి. ప్రస్తుతం పనిచేస్తున్న సూపర్‌వైజర్లను యథావిధిగా కొనసాగించాలి.-ఎఫ్‌ఎంఎస్‌ విభాగంలో మిషన్‌ ఆపరేటర్స్‌కు, ఆ్లక్‌ రిమూవర్స్‌కు ఆన్‌స్కిల్డ్‌ జీతాలు ఇవ్వాలనడం సరైనది కాదు, వారు సెమీస్కిల్డ్‌ కిందకు వస్తారు కాబట్టి సెమీ స్కిల్డ్‌ జీతాలు వర్తింపజేయాలి. కార్మిక నేతల పరిస్థితి ఆందోళనకరం వైద్య పరీక్ష అనంతరం డాక్టర్‌ కిషోర్‌ వెల్లడి టీటీడీ అటవీ కార్మికులకు మద్దతుగా నిరవధిక నిరాహార దీక్షలు చేపట్టిన కార్మిక నేతలు కందారపు మురళి సహా అటవీ కార్మికులందరి పరిస్థితి ఆందోళనకరంగా ఉందని డాక్టర్‌ కిషోర్‌ వైద్య పరీక్షల అనంతరం ప్రకటించారు. ఆదివారం రాత్రి దీక్షాస్తలి వద్ద నేతలందరికీ వైద్య పరీక్షలు నిర్వహించారు.షుగర్‌ లెవెల్స్‌ పడిపోయాయని, బిపి ఆందోళనకరంగా ఉందని ప్రకటించారు.తమ ఆరోగ్య పరిస్థితి ఎలా ఉన్నా దీక్షలు విరమించేది లేదని సమస్య పరిష్కారం అయ్యేవరకు దీక్షలు కొనసాగిస్తామని రేపు జరిగే టీటీడీ బోర్డు సమావేశంలో అటవీ కార్మికుల న్యాయమైన సమస్యలు పరిష్కరించాలని నేతలు కోరారు.రేపు ఉదయం 10 గంటలకు దీక్షా శిబిరం వద్ద అన్ని రాజకీయ పక్షాలు కార్మిక సంఘాలతో భారీ బహిరంగ సభ జరుగుతుందని తెలిపారు సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సిహెచ్‌ నర్సింగ రావు గారు (విజయవాడ) ఈ బహిరంగ సభలో పాల్గొంటారని ప్రకటించారు.అటవీ కార్మికుల దీక్షలపై స్పందించిన ఛైర్మన్‌30న జేఈవోతో చర్చలుప్రజాశక్తి తిరుపతి సిటీ: టీటీడీ అటవీ కార్మికులకు మద్దతుగా సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి కందారపు మురళి చేపట్టిన నిరవధిక దీక్షలు పట్ల టీటీడీ ఛైర్మన్‌ భూమన కరుణాకర్‌ రెడ్డి స్పందించారు. నిరవధిక దీక్ష ఆదివారం రెండో రోజుకు చేరుకోవడంతో దీనిపై స్పందించిన ఛైౖర్మన్‌ కార్మిక సంఘాల నాయకులను తిరుపతి పద్మావతి అతిధి గహానికి పిలిపించారు. కార్మికుల సమస్యలపై ఇప్పటికే అధికారులతో చర్చించమని, సోమవారం బోర్డు మీటింగ్‌ అనంతరం, ఈనెల 30 జెఈఓ వీరభద్రం కార్మికులు, సంఘాల నాయకులతో చర్చలు జరిపి సమస్యలు పరిష్కరిస్తారని హామీ ఇచ్చారు. పక్కనే వున్నా జెఈఓను ఒకటి రెండు రోజుల్లో సమస్యను పరిష్కరించాలని సూచించారు. సోమవారం సమయం, వేదిక తెలియచేస్తామని అధికారులు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి వందవాసి నాగరాజు, ఆర్‌పిఐ నాయకులు అంజయ్య, సిపిఐ నాయకులు విశ్వానాద్‌, సీఐటీయూ నాయకులు జి.బాలసుబ్రహ్మణ్యం, మునిరాజా, నాగ వెంకటేష్‌, తదితరులు పాల్గొన్నారు.

➡️