ఎస్‌వియు వీసీగా శ్రీకాంత్‌ రెడ్డి

ఎస్‌వియు వీసీగా శ్రీకాంత్‌ రెడ్డిప్రజాశక్తి – క్యాంపస్‌ శ్రీ వెంకటేశ్వర విశ్వ విద్యాలయ నూతన ఉపకులపతిగా ఆచార్య వి శ్రీకాంత్‌ రెడ్డిని నియమిస్తూ బుధవారం ఉత్తర్వులు జారీ అయ్యాయి. డాక్టర్‌ వి.శ్రీకాంత్‌ రెడ్డి 1992లో శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయంలో సహాయ ఆచార్యులుగా సైకాలజీ డిపార్ట్మెంట్లో చేరారు. తర్వాత అసోసియేషన్‌ ప్రొఫెసర్‌, ప్రొఫెసర్‌గా ఉద్యోగోన్నతి పొందారు. శ్రీ వెంకటేశ్వర విద్యాలయానికి పిఆర్‌ఓగా బాధ్యతలు నిర్వహించారు .సైకాలజీ విభాగాధిపతిగా , బి ఓ యస్‌ చైర్మన్‌ గా పలు సంవత్సరాలు పనిచేశారు. శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయానికి డీన్‌ అకడమిక్‌ అఫైర్స్‌ గా విజయవంతంగా బాధ్యత నిర్వహించారు .ఆ తర్వాత శ్రీ వెంకటేశ్వర సైన్స్‌ కళాశాల వైస్‌ ప్రిన్సిపాల్‌ గా ,ప్రిన్సిపాల్‌ గా పనిచేశారు. 2021-2022 మధ్య ఎస్‌ వి యు రెక్టార్‌గా బాధ్యతలు నిర్వహించారు. 2022 డిసెంబర్లో ఉద్యోగ విరమణ చేసిన వీరిని రాష్ట్ర ఉన్నత విద్యా రెగ్యులేటరీ మానిటరింగ్‌ కమీషన్‌ మెంబర్‌గా ఎంపిక చేసింది. ప్రస్తుతం అమరావతిలో ఆ బాధ్యతలు నిర్వహిస్తున్న వారిని శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయానికి వైస్‌ ఛాన్సలర్‌ గా నియమిస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది .శ్రీకాంత్‌ రెడ్డి నియామకం పట్ల పలువురు హర్షం వ్యక్తం చేస్తూ అభినందనలు తెలియజేస్తున్నారు.

➡️