ఏపీలో కాంగ్రెస్‌దే అధికారం: కర్ణాటక మంత్రి

ఏపీలో కాంగ్రెస్‌దే అధికారం: కర్ణాటక మంత్రి

ఏపీలో కాంగ్రెస్‌దే అధికారం: కర్ణాటక మంత్రి ప్రజాశక్తి-తిరుపతి(మంగళం): ఆంధ్రప్రదేశ్‌లో 2024లో జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్‌ భారీ మెజా రిటీతో అధికారాన్ని హస్త గతం చేసుకుం టుందని కర్ణాటక రాష్ట్ర సివిల్‌ సప్లై, ఫుడ్‌ అండ్‌ కన్జ్యూ మర్‌ ఎఫైర్స్‌ శాఖ మంత్రి కేహెచ్‌ మునియప్ప ఆశాభావం వ్యక్తం చేశారు. శ్రీవారి దర్శనార్థం శనివారం కుటుంబ సభ్యులతో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. మంత్రి మునియప్పకు ఏపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గౌడపేర చిట్టిబాబు సాధరంగా ఆహ్వానం పలికి స్వామి వారి దర్శన ఏర్పాట్లు చేశారు. ఈ సందర్భంగా మంత్రి మునియప్ప మాట్లాడుతూ రాష్ట్రంలో కాంగ్రెస్‌ తిరిగి అధికారంలోకి వస్తుందని నాయకులు, కార్యకర్తలు ధైర్యంగా ప్రజల్లోకి వెళ్లాలని పిలుపు నిచ్చారు. కాంగ్రెస్‌ అధినేత్రి సోనియా గాంధీ, రాహుల్‌ గాంధీ, ప్రియాంక గాంధీల సారధ్యంలో పిసిసి అధ్యక్షుడు గిడుగు రుద్రరాజు రాష్ట్రంలో పార్టీ బలోపేతానికి అవసరమైన కషి చేస్తున్నారన్నారు. ఇందులో భాగంగానే వైయస్‌ రాజశేఖర్‌ రెడ్డి కుమార్తె షర్మిల సైతం కాంగ్రెస్‌లోకి వచ్చారన్నారు. ఇది కాంగ్రెస్‌కి శుభ పరిణామమన్నారు. 2024 ఎన్నికల్లో కాంగ్రెస్‌ విజయం తథ్యమన్నారు.

➡️