కరువు ప్రాంతాల్లో అదనపు పని దినాలు కల్పించాలివ్యకాసం రాష్ట్ర అధ్యక్షులు దడాల సుబ్బారావు

కరువు ప్రాంతాల్లో అదనపు పని దినాలు కల్పించాలివ్యకాసం రాష్ట్ర అధ్యక్షులు దడాల సుబ్బారావు

కరువు ప్రాంతాల్లో అదనపు పని దినాలు కల్పించాలివ్యకాసం రాష్ట్ర అధ్యక్షులు దడాల సుబ్బారావుప్రజాశక్తి-శ్రీకాళహస్తి రాష్ట్రంలోని అన్ని కరువు ప్రాంతాల్లో వ్యవసాయ కూలీలకు అదనపు ఉపాధి హామీ పనులు కల్పించాలని వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు దడాల సుబ్బారావు డిమాండ్‌ చేశారు. శ్రీకాళహస్తి పుచ్చలపల్లి సుందరయ్య భవన్‌ లో సోమవారం వ్యవసాయ కార్మిక సంఘం తిరుపతి జిల్లా కమిటీ సమావేశం జరిగింది. ముఖ్యఅతిథిగా హాజరైన దడాల సుబ్బారావు మాట్లాడుతూ వామపక్షాల పోరాటంతో పురుడు పోసుకుని వ్యవసాయ కూలీలకు మూడు పూట్లా పొట్ట నింపే ఉపాధి హామీ పథకాన్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నీరుగార్చే ప్రయత్నం చేస్తున్నాయని మండిపడ్డారు. ఇప్పటికే మోడీ ప్రభుత్వం ఉపాధి హామీకి నిధులు, పనులు, వేతనాల్లో కోత పెట్టిందన్నారు. ఫలితంగా వ్యవసాయ కూలీలకు పొట్ట పోసుకోవడం గగనంగా మారిందిని వాపోయారు. రాష్ట్రంలోని అన్ని కరువు ప్రాంతాల్లో వంద రోజులకు మరో 50 రోజులు అదనంగా పని కల్పించాలని కోరారు. తిరుపతి జిల్లా బాలయ్య పల్లి మండలంలో దాదాపు 300 ఎకరాల ప్రభుత్వ భూమి ఉందనీ, ఓ రెడ్డి సాగు బడిలో ఈ భూములంతా ఉన్నాయనీ, ఆ భూములన్నిటిని పేదలకు పంచాలని డిమాండ్‌ చేశారు. ఈనెల 31వ తేదీ నుంచి వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో బాలయ్యపల్లి మండల కేంద్రంలో భూ పోరాటానికి వ్యవసాయ కూలీలు సిద్ధమవుతున్నట్లు స్పష్టం చేశారు. రాష్ట్రానికి రావాల్సిన ప్రత్యేక హౌదా, హక్కులపై జగన్‌ ప్రభుత్వం తో పాటు ప్రతిపక్షాలైన టిడిపి, జనసేన, బిజెపిలు నోరు మెదపడం లేదనీ, రానున్న ఎన్నికల్లో ఈ పార్టీలన్నిటికీ వ్యవసాయ కూలీలు తగిన గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చారు. వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి బాలకష్ణ, రాజగోపాల్‌ తదితరులు పాల్గొన్నారు.

➡️