ఘనంగా స్విమ్స్‌ వార్షికోత్సవ వేడుకలు

ఘనంగా స్విమ్స్‌ వార్షికోత్సవ వేడుకలు

ఘనంగా స్విమ్స్‌ వార్షికోత్సవ వేడుకలుప్రజాశక్తి -తిరుపతి సిటీ శ్రీ వెంకటేశ్వర వైద్య విజ్ఞాన సంస్థ (స్విమ్స్‌) 31 వ వార్షికోత్సవాన్ని సోమవారం ఘనంగా నిర్వహించారు. స్థానిక మహతి ఆడిటోరియంలో జరిగిన కార్యక్రమానికి టిటిడి చైర్మన్‌ భూమన కరుణాకర్‌ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్విమ్స్‌ ను దేశం లోనే అత్యున్నత వైద్య సంస్థగా తీర్చిదిద్దేందుకు చర్యలు చేపడతాం అన్నారు. స్విమ్స్‌ వైద్యులు అందిస్తున్న వైద్య సేవలు అనన్య సామాన్యమైనవని, వైద్య వత్తిలో వారి జీవన అవసరాలకు మించి సంపాదించే శక్తి, సామర్థ్యాలు ఉన్నప్పటికీ, సేవే పరిమావధిగా వైద్య సేవలు అందిస్తున్నారని కొనియాడారు. విద్యార్థులు కూడా సంపాదనే ధ్యేయంగా కాకుండా సమాజ హితం కోసం సేవలు చేయాల్సిన అవసరం ఉందని సూచించారు. అనంతరం వివిధ పోటీల్లో గెలుపొందిన విజేతలకు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో తిరుపతి నగర్‌ మేయర్‌ డాక్టర్‌ శిరీష, స్విమ్స్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ ఏఆర్‌ కుమార్‌ పాల్గొన్నారు.

➡️