చంద్రబాబుకు ఓటమి తప్పదు: భూమన కరుణాకర్‌రెడ్డి

చంద్రబాబుకు ఓటమి తప్పదు: భూమన కరుణాకర్‌రెడ్డి

చంద్రబాబుకు ఓటమి తప్పదు: భూమన కరుణాకర్‌రెడ్డి ప్రజాశక్తి -తిరుపతి టౌన్‌ఈ ఎన్నికల తర్వాత చంద్రబాబు పార్టీ కనపడే పరిస్థితి లేదని, టిడిపి, జనసేన పార్టీలకు జగనన్న సమాధి కట్టబోతున్నారని తిరుపతి సిట్టింగ్‌ ఎంఎల్‌ఎ భూమన కరుణాకర్‌రెడ్డి అన్నారు. శుక్రవారం నగరంలోని ఎంఆర్‌పల్లిలో వైసిపి ఎంఎల్‌ఎ అభ్యర్థి భూమన అభినరురెడ్డితో కలిసి ప్రచారం నిర్వహించారు. కరుణాకర్‌రెడ్డి మాట్లాడుతూ చంద్రబాబు పూటకోఅబద్దం చెబుతూ, రోజుకో అసత్యం మాట్లాడుతూ ప్రజలను మోసగిస్తున్నారన్నారు. అబద్దాలు చెప్పడంలో చంద్రబాబు నిష్ణాతుడన్నారు. గత 30 ఏళ్లుగా చంద్రబాబు మోసాన్ని ప్రజలు గమనిస్తూనే ఉన్నారన్నారు. సంక్షేమ లబ్ది పొందిన వారంతా చంద్రబాబుకే ఓటు వేస్తారన్న విషయం తెలుసుకోవాలన్నారు.

➡️