చిరు వ్యాపారులకు గొడుగులు పంపిణీ

చిరు వ్యాపారులకు గొడుగులు పంపిణీ

చిరు వ్యాపారులకు గొడుగులు పంపిణీ ప్రజాశక్తి- తిరుపతి టౌన్‌: తిరుపతి లయన్స్‌ క్లబ్‌ అధ్యక్షులు బి.మునికష్ణ నాయుడు ఆధ్వర్యంలో శనివారం తిరుపతి నగరంలోని నేతాజీ వీధి, గాంధీ వీధి తదితర ప్రాంతాలలో చిరువ్యాపారమే జీవనాధారంగా కుటుంబాలను పోషించుకుంటున్న చిరు వ్యాపారులకు ఎండకు, వానకు రక్షణగా ఉచితంగా గొడుగులు అందజేయడం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మునికష్ణ నాయుడు మాట్లాడుతూ లయన్స్‌ క్లబ్‌ వ్యవస్థాపకులు లయన్‌ మెల్విన్‌జోన్స్‌ పుట్టినరోజు సందర్భంగా ఈకార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. లయన్స్‌ క్లబ్‌ స్థాపించి దాదాపు 105 సంవత్సరాలు పైబడి సేవే లక్ష్యంగా పనిచేస్తూ ఎంతోమంది పేదలకు తన వంతు బాధ్యతగా ఉచితంగా సేవలందిస్తున్న సేవాసంస్థ లయన్స్‌ క్లబ్‌ తెలిపారు. అన్నదానాలు, కంటి పరీక్షలు, చికిత్సలు, డయాబెటిక్‌ పరీక్షలు, వద్ధాశ్రమాలకు నిత్యావసర సరుకులు, ప్రభుత్వ పాఠశాలలో చదివే పేదవిద్యార్థులకు విద్యాసామాగ్రి అందిస్తున్నదని తెలిపారు. ఒక్కరితో ప్రారంభమైన ఈ సేవా సంస్థ ఈనాడు దాదాపు 15 లక్షల మంది సభ్యులతో 200 దేశాలకు పైగా క్లబ్బులను ఏర్పాటు చేసి తన సేవా కార్యక్రమాలను అందించడం జరుగుతోందన్నారు. క్లబ్‌ కార్యదర్శి ముబారక్‌ బాషా, ట్రెజరర్‌ వినోద్‌, వెంకటాచలం తదితరులు పాల్గొన్నారు.

➡️