జగన్‌ సీఎం అయితే ఏపీకి పరిశ్రమలు రావుమాజీ మంత్రి గంటా

జగన్‌ సీఎం అయితే ఏపీకి పరిశ్రమలు రావుమాజీ మంత్రి గంటా

జగన్‌ సీఎం అయితే ఏపీకి పరిశ్రమలు రావుమాజీ మంత్రి గంటాప్రజాశక్తి-శ్రీకాళహస్తి: జగన్‌ మరోసారి రాష్ట్ర ముఖ్యమంత్రి అయితే ఆంధ్ర రాష్ట్రానికి ఏ ఒక్క కొత్త పరిశ్రమ కూడా రాదని మాజీ మంత్రి, టిడిపి సీనియర్‌ నేత గంటా శ్రీనివాసరావు అన్నారు. విశాఖ నుంచి హైదరాబాద్‌ తరలిపోయిన లూలూ పరిశ్రమే ఇందుకు ఉదాహరణని ఎద్దేవా చేశారు. గంటా శ్రీనివాసరావు శుక్రవారం శ్రీకాళహస్తికి విచ్చే శారు. తన పుట్టినరోజు సందర్భంగా ముక్కంటిని దర్శించు కున్నారు. తదనంతరం టిడిపి శ్రీకాళహస్తి నియోజకవర్గం ఇన్‌చార్జ్జి బొజ్జల వెంకట సుధీర్‌ రెడ్డి స్వగ్రామం ఊరందూరులో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. 4 ఏళ్లా9 నెలల కాలంలో జగన్‌ రెడ్డి చేసిన అభివద్ధి శూన్యమన్నారు. ఏపీ అభివద్ధి అధ:పాతాళానికి చేరిందని విమర్శించారు. ఒక్క ఛాన్స్‌, నవరత్న పథకాలు అంటూ అధికారంలోకి వచ్చిన జగన్‌ రాష్ట్ర ప్రజలను నట్టేట ముంచాడంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. నవరత్నాలు పథకాల్లో ఏ ఒక్క హామీని నూరు శాతం అమలు చేశామని జగన్‌ అండ్‌ కో నిరూపిస్తే తామంతా రాజకీయ సన్యాసం పుచ్చుకుంటామని సవాల్‌ విసిరారు. మద్యపాన నిషేధం, జలయజ్ఞం హామీలు ఏమయ్యాయో ప్రజలు గమనిం చా లని సూచించారు. ‘టిడిపి అధికారంలో ఉండగా శ్రీకాళహస్తి కి 25 పరిశ్రమలు వచ్చాయనీ, మరి జగన్‌ పాలనలో ఏ ఒక్క పరిశ్రమైనా రాష్ట్రానికి వచ్చిందా..?’ అంటూ ప్రశ్నించారు. 5వేల మందికి ప్రత్యక్షంగా ఉపాధి కల్పించే అంతర్జాతీయ కంపెనీ లూలూ పరిశ్రమను చంద్రబాబు విశాఖకు తీసుకొస్తే, జగన్‌ వారిని వెళ్లగొట్టి నిరుద్యోగుల పొట్ట కొట్టాడంటూ విమ ర్శించారు. ఈ నేపథ్యంలో లూలూ అధినేత జగన్‌ ఉండగా తాము ఏపీ రామంటూ బహిరంగంగా ప్రకటన చేయడం అందరికీ తెలిసిన విషయమే అన్నారు. మరో రెండు నెలల్లో ఏపీకి ఎన్నికల నోటిఫికేషన్‌ రానున్న నేపథ్యంలో ఉత్తరాంధ్ర పర్యటనకు సీఎం జగన్‌ వస్తున్నారనీ, ఆయన ఏ ముఖం పెట్టుకొని ఇక్కడికి వస్తున్నారో చెప్పాలని డిమాండ్‌ చేశారు. విశాఖ ఉక్కు, విశాఖ రైల్వే జోన్‌, విశాఖ మెట్రో ఏమయ్యాయని ప్రశ్నించారు. 22 మంది ఎంపీలను తన వెంట పెట్టుకున్న జగన్‌ ప్రత్యేక హోదాను సాధించాల్సింది పోయి మోడీకి ఊడిగం చేస్తున్నారంటూ విమర్శించారు. ‘జగన్‌ విశాఖకు ఏ ముఖం పెట్టుకుని మీరు వస్తున్నారు..? ఉత్తరాంధ్రకు ఇచ్చిన హామీ ఒక్కటైనా నెరవేర్చారా…?’ ఉత్తరాంధ్ర వెనుకబాటు తనం నాలుగేళ్ల తొమ్మిది నెలలకు కనబడిందా..?” అంటూ మాజీ మంత్రి, విశాఖ (ఉత్తర) శాసనసభ్యులు గంటా శ్రీనివాసరావు నిలదీశారు. టిడిపి అధికారంలోకి వస్తే రాష్ట్రం మళ్లీ అభివద్ధి పథంలోకి పయనిస్తుందనీ, మరో మూడు నెలల్లో జగన్‌ ప్రభుత్వం పడిపోతుందని జోష్యం చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్‌, బొజ్జల సుధీర్‌ రెడ్డి పాల్గొన్నారు.

➡️