టిటిడి ఉద్యోగులందరికీ ఇళ్లపట్టాలురెండో విడత పంపిణీలో భూమన కరుణాకరరెడ్డిమిగిలినవారికి ఏర్పేడు వద్ద 450 ఎకరాలు సేకరణ

టిటిడి ఉద్యోగులందరికీ ఇళ్లపట్టాలురెండో విడత పంపిణీలో భూమన కరుణాకరరెడ్డిమిగిలినవారికి ఏర్పేడు వద్ద 450 ఎకరాలు సేకరణ

టిటిడి ఉద్యోగులందరికీ ఇళ్లపట్టాలురెండో విడత పంపిణీలో భూమన కరుణాకరరెడ్డిమిగిలినవారికి ఏర్పేడు వద్ద 450 ఎకరాలు సేకరణప్రజాశక్తి – తిరుపతి సిటి: దేశంలో ఏ ప్రభుత్వ ఉద్యోగికీ లేనివిధంగా అతి తక్కువ ధరకు ఉద్యోగులందరికీ ఇళ్లపట్టాలు ఇచ్చిన ఘనత టీటీడీకే దక్కుతుందని టీటీడీ ధర్మకర్తల మండలి అధ్యక్షులు భూమన కరుణాకరరెడ్డి తెలియజేశారు. ఉద్యోగులకు తన చేతులమీదుగా ఇంటిపట్టాల పంపిణీ జరగడం తన అదృష్టమన్నారు. టీటీడీ ఉద్యోగులకు రెండో విడత ఇంటి పట్టాల పంపిణీ పండుగ కార్యక్రమం సోమవారం ఉదయం తిరుపతి మహతి ఆడిటోరియంలో వేడుకగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన కరుణాకర రెడ్డి మాట్లాడుతూ 17 సంవత్సరాల క్రితం తాను టీటీడీ చైర్మన్‌ గా ఉన్న సమయంలో అప్పటి ముఖ్యమంత్రి వైయస్‌ రాజశేఖరరెడ్డిని కలిసి ఉద్యోగుల ఇళ్ల స్థలాల విషయమై చర్చించినట్లు చెప్పారు. తన ఒత్తిడి వల్లే ఉద్యోగులకు ఇంటిస్థలాలు మంజూరు చేసినట్టు 2009లో వైఎస్‌ రాజశేఖరరెడ్డి ఇదే వేదిక మీద తెలియజేశారని ఆయన గుర్తు చేశారు. ఉద్యోగులందరికీ ఇంటి స్థలాలు ఇప్పించే విషయం గురించి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డిని తాను సంప్రదించినప్పుడు ఆయన ఉద్యోగులందరికీ ఉచితంగా ఇంటి స్థలాలు ఇద్దామని చెప్పారన్నారు. అయితే చట్ట ప్రకారం ఇందులో కొన్ని ఇబ్బందులు ఎదురవుతున్న కారణంగానే నామమాత్రపు ధరతో ఉద్యోగులకు, రిటైర్డ్‌ ఉద్యోగులందరికీ ఇంటి పట్టాలు మంజూరు చేయడానికి ముఖ్యమంత్రి అంగీకరించారన్నారు. ఈ కార్యక్రమాన్ని సాకారం చేయడంలో ఈఓ ధర్మారెడ్డి, జిల్లా కలెక్టర్‌ వెంకటరమణారెడ్డి, జేఈవోలు సదా భార్గవి, వీరబ్రహ్మం, ఇతర కార్యనిర్వాహకవర్గం తనకు చేదోడు వాదోడుగా ఉండి ముందుకు నడిపించారని అభినందించారు. మూడో విడతగా రిటైర్డ్‌ ఉద్యోగులకు, మిగిలిన ఉద్యోగులందరికీ ఇంటి స్థలాలు ఇవ్వడం కోసం ఏర్పేడు మండలం పాగాలి వద్ద 350 ఎకరాల భూమిని టిటిడికి ఇవ్వడంలో కలెక్టర్‌ వెంకటరమణారెడ్డి కృషి అభినందనీయమన్నారు. ఇందుకోసం ధర్మకర్తల మండలిలో 87 కోట్ల 50 లక్షల రూపాయలు మంజూరుచేయించడంలో ఈవో ప్రత్యేక శ్రద్ధ చూపారన్నారు. ఏర్పేడు వద్ద ఈ నెలాఖరు లోపు 450 ఎకరాలను ప్రభుత్వం నుండి స్వాధీనం చేసుకుని మూడో విడతలో రిటైర్డ్‌ ఉద్యోగులకు, ఉద్యోగులకు అందిస్తామన్నారు. త్వరలోనే 4 వేల మందికి పైగా ఉద్యోగులకు, రిటైర్డ్‌ ఉద్యోగులకు ఇంటిస్థలాలు అందజేస్తామని చెప్పారు. అనంతరం ఛైర్మన్‌ భూమన కరుణాకరరెడ్డి, ఈవో ధర్మారెడ్డి చేతులమీదుగా ఉద్యోగులకు ఇంటిస్థలం పత్రాలను మొత్తం 1703 మందికి రెండో విడతలో ఇంటిస్థలాలు పంపిణీ చేశారు. జేఈవో సదా భార్గవి, సివిఎస్‌ఓ నరసింహ కిషోర్‌, డిఎల్వో వీర్రాజు, సిఈ నాగేశ్వరరావు పాల్గొన్నారు.

➡️