టిటిడి ఉద్యోగ కార్మికులకు రూ.10కే భోజనంఔట్‌సోర్సింగ్‌ కార్మికులకు వేతనాలు పెంపుటిటిడి పాలకమండలి కీలక నిర్ణయాలు

టిటిడి ఉద్యోగ కార్మికులకు రూ.10కే భోజనంఔట్‌సోర్సింగ్‌ కార్మికులకు వేతనాలు పెంపుటిటిడి పాలకమండలి కీలక నిర్ణయాలు

టిటిడి ఉద్యోగ కార్మికులకు రూ.10కే భోజనంఔట్‌సోర్సింగ్‌ కార్మికులకు వేతనాలు పెంపుటిటిడి పాలకమండలి కీలక నిర్ణయాలుప్రజాశక్తి – తిరుమలతిరుమల తిరుపతి దేవస్థానం క్యాంటీన్‌లో పర్మినెంట్‌ ఉద్యోగులకే కాకుండా, కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులందరికీ రూ.10కే భోజనం అందించేందుకు పాలకమండలి తీర్మానం చేసింది. అలాగే టిటిడిలోని వివిధ విభాగాల్లో పనిచేస్తున్న 9వేల మంది సొసైటీ ఉద్యోగులు, కాంట్రాక్టు కార్మికులకు జీతాలు పెంచుతున్నట్లు టిటిడి ఛైర్మన్‌ భూమన కరుణాకర్‌రెడ్డి మీడియాకు వెల్లడించారు. సీఎం జగన్‌, టీటీడీపై విమర్శలు చేసిన రమణ దీక్షితులను గౌరవ ప్రధాన అర్చకుని ఉద్యోగం నుంచి తొలగిస్తున్నట్లు ప్రకటించారు. సోమవారం టీటీడీ ధర్మకర్తల మండలి సమావేశం తిరుమల అన్నమయ్యభవనంలో జరిగింది. ఇక నుంచి ప్రతి ఏటా ఫిబ్రవరి 24న తిరుపతి ఆవిర్భావ దినోత్సవం నిర్వహించనున్నట్లు తెలిపారు.రూ.4 కోట్లతో మంగళసూత్రాల తయారీనడకదారిలో గాలిగోపురం, ఆంజనేయస్వామి ఆలయం వద్ద నిత్య సంకీర్తన అర్చన కార్యక్రమాలు నిర్వహించాలని టీటీడీ పాలక మండలి నిర్ణయించింది. తాళ్లపాకలో అన్నమయ్య కళామందిరం నిర్మాణం చేపట్టనున్నారు. తిరుమల పెద్ద జీయర్‌స్వామి అనుమతితో ద్వారపాలకులు జయవిజయలకు బంగారు తాపడం చేయాలని పాలకమండలి నిర్ణయించింది. రూ.4 కోట్లతో మంగళసూత్రల తయారీకి నాలుగు ప్రముఖ బంగారు వ్యాపార సంస్థలకు టెండర్లకు అప్పగించనున్నారు. తిరుచానూరు పద్మావతి అమ్మవారి ఆలయానికి విద్యుత్‌ అలంకరణలకు బోర్డు ఆమోదం తెలిపింది. కార్పొరేషన్‌లోని అటవీశాఖ కార్మికులను తిరిగి సొసైటీలో చేర్చి జీతాలు పెంచాలని నిర్ణయించారు. పాదిరేడులోని ఉద్యోగుల ఇంటి స్థలాల లేఅవుట్‌ అభివద్ధికి రూ.8.16 కోట్లు తుడాకు చెల్లించాలని నిర్ణయించారు. రూ.3.15 కోట్లతో తిరుమలలో పలుచోట్ల కొత్త మోటార్‌ పంపుసెట్లు ఏర్పాటు చేయనున్నారు. తిరుమలలో ఎఫ్‌.ఎం.ఎస్‌ సేవలకు మరో మూడేళ్లు పొడిగించాలని నిర్ణయించారు.ఉద్యోగులకు, కార్మికులకు రూ.10కే భోజనంగోవిందరాజస్వామి ఆలయంలో ఉత్సవవిగ్రహాలకు బంగారుపూత, అలిపిరి, గాలిగోపురం, లక్ష్మీనరసింహస్వామి వద్ద ఉన్న నీటి బావులు ఆధునికీకరణకు బోర్డు అనుమతి తెలిపారు. శ్రీలంకలో శ్రీవారి కల్యాణం నిర్వహించాలని పాలక మండలి నిర్ణయించింది. పెద్ద సంఖ్యలో లడ్డు తయారికీ సూపర్వైజర్‌ పోస్టుల కోసం ప్రభుత్వానికి లేఖ రాయాలని నిర్ణయించారు. పాపనాశానం వద్ద 682 మోటర్‌ పంపు సెట్లకు రూ.3.18 కోట్లు కేటాయించనున్నారు.1700 సంవత్సరాల చరిత్ర ఉన్న తిరుపతి తాతయ్య గుంట గంగమ్మ ఆలయానికి రూ.50 లక్షలు మంజూరు చేయాలని టీటీడీ బోర్డు నిర్ణయించింది. అలిపిరి , గాలిగోపురం నరసింహ స్వామి ఆలయం వద్ద ఉన్న ముగ్గు బావి ఆధునీకరణ చేపట్టాలని బోర్డు నిర్ణయించింది. ఉద్యోగులకు హెచ్‌ఆర్‌ఏ పెంపునకు నిర్ణయం తీసుకుంది. స్విమ్స్‌లో ఆరోగ్యశ్రీ కార్డు ఉన్న వారికి ఉచిత వైద్యం అందించాలని పాలక మండలి నిర్ణయించింది. కాంట్రాక్టు, అవుట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులకు క్యాంటీన్‌లో రూ.10కే భోజనం అందించాలని నిర్ణయించింది.టీటీడీలో వేతనాల పెంపుపై సిఐటియు హర్షంతిరుమల తిరుపతి దేవస్థానంలో ఏళ్ల తరబడి విధులు నిర్వర్తిస్తూ తీవ్ర వివక్షకు గురవుతున్న వేలాదిమంది కార్మికులకు టీటీడీ పాలకమండలి వేతనాలు పెంచడం పట్ల సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి కందారపు మురళి ఓ ప్రకటనలో హర్షం వెలిబుచ్చారు. టీటీడీ చైర్మన్‌ భూమన కరుణాకర్‌ రెడ్డికి తాము పలుమార్లు చేసిన విజ్ఞప్తిని దష్టిలో ఉంచుకొని సానుకూల నిర్ణయం చేసినందుకు అభినందనలు తెలియజేశారు. టిటిడి క్యాంటీన్లులో పర్మినెంట్‌ ఉద్యోగులకే నన్న భావన తొలగించి కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్‌, ఎఫ్‌ఎంఎస్‌ కార్మికులకూ భోజన వసతి కల్పించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. ఇదే తరహాలో బ్రహ్మోత్సవ బహుమానాన్ని అందరినీ వర్తింపజేయాలని విజ్ఞప్తి చేశారు.

➡️