టిడిపికి భారీ షాక్‌..!శ్రీ రెస్‌ గూటికి ‘పోతుగుంట’ ఎమ్మెల్యే అభ్యర్థిగా శ్రీకాళహస్తి నుంచి పోటీ

టిడిపికి భారీ షాక్‌..!శ్రీ రెస్‌ గూటికి 'పోతుగుంట' ఎమ్మెల్యే అభ్యర్థిగా శ్రీకాళహస్తి నుంచి పోటీ

టిడిపికి భారీ షాక్‌..!శ్కాంగ్రెస్‌ గూటికి ‘పోతుగుంట’శ్రీ ఎమ్మెల్యే అభ్యర్థిగా శ్రీకాళహస్తి నుంచి పోటీప్రజాశక్తి- శ్రీకాళహస్తి: శ్రీకాళహస్తినియోజకవర్గ ఎన్నికల బరిలో దూసుకుపోతున్న టిడిపికి భారీ షాక్‌ తగిలింది. ఆ పార్టీ సీనియర్‌ నేత, ట్రస్ట్‌ బోర్డు మాజీ చైర్మన్‌ పోతుగుంట గురవయ్య నాయుడు తనయుడు డాక్టర్‌ పోతుగుంట రాజేష్‌ నాయుడు మంగళవారం కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల, రాష్ట్ర ఉపాధ్యక్షులు తులసీ రెడ్డి సమక్షంలో పోతుగుంట రాజేష్‌ నాయుడు కాంగ్రెస్‌ తీర్థం పుచ్చుకోవడం జరిగింది. రాజేష్‌ నాయుడు ప్రముఖ వైద్యుడిగా, వ్యాపారవేత్తగా ఉన్నాగానీ, తండ్రి ఆశయాలు, రాజకీయంపై ఉన్న మక్కువతో గత రెండేళ్లుగా శ్రీకాళహస్తిలో మకాం వేసి సేవా కార్యక్రమాల్లో మునిగితేలుతున్నారు. ఈ క్రమంలోనే ఆయన శ్రీకాళహస్తి నుంచి టిడిపి టిక్కెట్టు గట్టిగానే ఆశించారు. టిడిపి నుంచి ఆ పార్టీ ఇంచార్జ్‌ బొజ్జల సుధీర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే ఎస్సీవి నాయుడు నుంచి గట్టి పోటీనే ఉంది. ఈ క్రమంలో తనకే టిక్కెట్టు కావాలని ఢిల్లీ స్థాయిలో రాజేష్‌ నాయుడు మంతనాలు జరిపారు. తీరా కూటమి పొత్తులో భాగంగా శ్రీకాళహస్తి టికెట్టు బొజ్జల సుధీర్‌ రెడ్డికి దక్కడంతో రాజేష్‌ నాయుడు కోరిక ఫలించలేదు. యువకుడిగా, తండ్రికి తగ్గ తనయుడిగా మార్పు కోరుకుంటున్న రాజేష్‌ నాయుడు చివరకు కాంగ్రెస్‌ పార్టీ తరఫున శ్రీకాళహస్తి నుంచి పోటీ చేసేందుకు సిద్ధమవుతుండడం గమనార్హం. రాజేష్‌ నాయుడు కాంగ్రెస్‌ పార్టీలో చేరిక శ్రీకాళహస్తిలో సంచలనమే కానుంది. ఆయనకు తొట్టంబేడు మండలంతో పాటు శ్రీకాళహస్తి, ఏర్పేడు మండలాల్లో కూడా కమ్మ సామాజిక వర్గంలో మంచి పట్టు ఉంది. గత రెండేళ్లుగా సేవా కార్యక్రమాలు చేపడుతూ అన్ని సామాజిక వర్గాల ప్రజలకు కూడా దగ్గరయ్యారు. టిడిపి సీనియర్‌ నేతగా ఉన్న రాజేష్‌ నాయుడు కాంగ్రెస్‌ తీర్థం పుచ్చుకోవడంతో టిడిపి వర్గాలను కలవర పెడుతుందని చెప్పుకోవాలి. ఆయన రానున్న ఎన్నికల్లో గెలిచినా, గెలవకపోయినా ప్రత్యామ్నాయ రాజకీయాలతో పాటు, మార్పు కోసం పాటుపడ్డ వ్యక్తిగా నిలిచిపోతారు.

➡️