తప్పుడు వార్తలు రాయొద్దు : మాజీ మంత్రి పరసారత్నం

తప్పుడు వార్తలు రాయొద్దు : మాజీ మంత్రి పరసారత్నం

తప్పుడు వార్తలు రాయొద్దు : మాజీ మంత్రి పరసారత్నంప్రజాశక్తి-తిరుపతి(మంగళం):తనను ఎల్లపుడూ వెన్నుతట్టి ప్రోత్సహించేది చంద్రబాబునాయుడని, పులివర్తి నానిని పరామర్శించిన తరువాత ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో తనను ఎవరూ నిల్చోమని చెప్పలేదని మాజీ మంత్రి పరసారత్నం స్పష్టం చేశారు. బుధవారం తిరుపతి ప్రెస్‌క్లబ్‌లో ఆయన మాట్లాడుతూ విలేకరుల సమావేశంలో తాను నిల్చుని ఉండటాన్ని కొన్ని పత్రికలు తప్పుడు వార్తలుగా చిత్రీకరించడాన్ని ఖండించారు. దళితుల పట్ల బాబుకు చిన్నచూపే ఉంటే, సూళ్లూరుపేట నియోజకవర్గం నుంచి తనకు ఆరుసార్లు ఎంఎల్‌ఎగా అవకాశం ఇచ్చారని గుర్తు చేశారు. అంతో ఇంతో దళితులకు మంచి జరిగిందంటే అది టిడిపి హయాంలోనేనని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో నాగూరు కోదండ రామయ్య, రేవతి, సుబ్బయ్య పాల్గొన్నారు.

➡️