తిరుపతి డిప్యూటీ కమిషనర్‌ చంద్రమౌళీశ్వర్‌ రెడ్డి బదిలీ

తిరుపతి డిప్యూటీ కమిషనర్‌ చంద్రమౌళీశ్వర్‌ రెడ్డి బదిలీ

తిరుపతి డిప్యూటీ కమిషనర్‌ చంద్రమౌళీశ్వర్‌ రెడ్డి బదిలీప్రజాశక్తి -తిరుపతి టౌన్‌ / సూళ్లూరుపేట అసెంబ్లీ, పార్లమెంట్‌ ఎన్నికల సందర్భంగా త్వరలో షెడ్యూల్‌ వెలువడనున్న నేపథ్యంలో తిరుపతి మున్సిపల్‌ కార్పొరేషన్‌ డిప్యూటీ కమిషనర్‌ చంద్రమౌళిశ్వర్‌ రెడ్డి బదిలీ అయ్యారు. అమలాపురం అర్బన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ వైస్‌ఛైర్మన్‌గా ఉన్న ఎన్‌.అమరయ్య ఈ స్థానానికి రానున్నారు. నాలుగున్నర సంవత్సరాలుగా పనిచేస్తున్న చంద్రమౌళీశ్వర్‌ రెడ్డిని మంగళగిరిలో మెప్మా అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. తిరుపతి మున్సిపల్‌ కార్పొరేషన్‌లో అడిషనల్‌ కమిషనర్‌ పోస్టు గత కొన్ని నెలలు గా ఖాళీగా ఉంది. కమిషనర్‌ హరిత కూడా ఎన్నికల బదిలీల్లో భాగంగా బదిలీ కానున్నారు. సూళ్లూరుపేట మున్సిపల్‌ కమిషనర్‌ నరేంద్ర కుమార్‌ను నెల్లూరు కార్పొరేషన్‌ సూపరింటెండెంట్‌గా నియమించారు. రాయచోటి కమిషనర్‌ గా ఉన్న గంగా ప్రసాద్‌ ను సూళ్లూరుపేటకు బదిలీ చేశారు.అలాగే నాయుడుపేట మున్సిపల్‌ కమిషనర్‌ శ్రీనివాసరావు ప్రకాశం జిల్లా గిద్దలూరు కమిషనర్‌ గా బదిలీ అయ్యారు.నూతన కమిషనర్‌ గా జనార్దన్‌ రెడ్డిని నియమించారు.

➡️