తిరుపతి నగర మున్సిపల్‌ కార్పొరేషన్‌ కమిషనర్‌గా ఆదిత్య సింగ్‌

Jan 28,2024 23:08
తిరుపతి నగర మున్సిపల్‌ కార్పొరేషన్‌ కమిషనర్‌గా ఆదిత్య సింగ్‌

ప్రజాశక్తి- తిరుపతి టౌన్‌: తిరుపతి మున్సిపల్‌ కార్పొరేషన్‌ కమిషనర్‌ హరిత బదిలీ అయ్యారు. పలువురు ఐఏఎస్‌ అధికారులను బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. గత ఏడాది ఏప్రిల్‌లో నెల్లూరు కమిషనర్‌గా ఉన్న హరిత తిరుపతి కార్పొరేషన్‌కు కమిషనర్‌గా బాధ్యతలు తీసుకున్నారు. 8 నెలలు పాటు తిరుపతి కార్పొరేషన్‌ కమిషనర్‌ హరిత ఎన్నో అభివద్ధి కార్యక్రమాలు చేపట్టారు. ఆమెను రాష్ట్ర ప్రభుత్వం ఏపీ యుఎఫ్‌ఐ డిసిఎండిగా హరితను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. తిరుపతి మున్సిపల్‌ కార్పొరేషన్‌ నూతన కమిషనర్‌గా ఆదిత్య సింగ్‌ నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. వీరు రెండు రోజుల్లో బాధ్యతలు తీసుకోనున్నారు.

➡️