తిరుపతి వైసిపి ఎంపి అభ్యర్థిగా రాజేష్‌విమర్శించినందుకే ఆదిమూలంకు చెక్‌

తిరుపతి వైసిపి ఎంపి అభ్యర్థిగా రాజేష్‌విమర్శించినందుకే ఆదిమూలంకు చెక్‌

తిరుపతి వైసిపి ఎంపి అభ్యర్థిగా రాజేష్‌విమర్శించినందుకే ఆదిమూలంకు చెక్‌ప్రజాశక్తి – తిరుపతి బ్యూరో ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీలో రాజకీయ పరిణామాలు ఊపందుకుంటున్నాయి. సత్యవేడు ఎంఎల్‌ఎ ఆదిమూలంకు ఃస్థానికంఃగా కొర్రి పెట్టారు. జిల్లాలో ఎవరూ చేయని విధంగా అధిష్టానం ఆదేశాల మేరకు 600 రోజుల పాటు గడప గడప కార్యక్రమం నిర్వహించి ప్రజలకు చేరువయ్యానని, మంత్రి పెద్దిరెడ్డి జోక్యంచేసుకుని తనకు సీటు బదలాయింపు చేశారని తారాస్థాయిలో విరుచుకుపడ్డారు. జగన్‌ జరిపిన సర్వేలో ఆదిమూలంకు గెలిచే పరిస్థితి లేదని నివేదిక రావడంతో తిరుపతి ఎంపి అభ్యర్థిగా బదిలీ చేశారు. తనపై నియోజకవర్గంలో వ్యతిరేకత లేనప్పటికీ కావాలనే గురుమూర్తికి అవకాశం కల్పించడానికి తనను పక్కన పెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదివారం ఈ విషయమై మీడియా ఎదుట ఆదిమూలం వాపోయారు. దీంతో పెద్దిరెడ్డి సీరియస్‌ అయ్యారు. తిరుపతి ఎంపి అభ్యర్థిగా ఆదిమూలంను ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి అధికారికంగా ప్రకటించినప్పటికీ, మంత్రిపై విమర్శలు చేయడంతో రాజకీయంగా ఆదిమూలంకు చెక్‌పెట్టారు. జీడీనెల్లూరు టిక్కెట్‌ ఆశిస్తున్న మాజీ మంత్రి గుమ్మడి కుతూహలమ్మ చెల్లెలి కొడుకు రాజేష్‌కు ఃస్థానికంగాః సీటు భంగం కలిగింది. దీంతో పెద్దిరెడ్డి రాజేష్‌ను ఆదివారం రాత్రి ఇంటికి పిలిపించి తిరుపతి ఎంపి అభ్యర్థిగా పోటీ చేయాలని అవకాశం ఇచ్చినట్లు తెలుస్తోంది. అందుకు రాజేష్‌ సుముఖత వ్యక్తం చేశారని సమాచారం. ఈ నేపథ్యంలో తిరుపతి వైసిపి ఎంపి అభ్యర్థిగా రాజేష్‌ను త్వరలోనే అధికారికంగా ప్రకటించనున్నారు. ఆదిమూలంకు అటు ఎంఎల్‌ఎగానూ, ఎంపిగానూ రెండు అవకాశాలను కోల్పోయారు.

➡️