తూతూ మంత్రంగా మండల సమావేశం

తూతూ మంత్రంగా మండల సమావేశం

తూతూ మంత్రంగా మండల సమావేశం ప్రజాశక్తి -రామచంద్రపురం ( చంద్రగిరి): మండలంలో నెలకొన్న ప్రజా సమస్యలపై అధికారులు వెంటనే స్పందించి పరిష్కరించాలని ఎంపీపీ హేమేంద్ర కుమార్‌ రెడ్డి అన్నారు. సోమవారం ఎంపీడీవో కార్యాలయంలో మండల సర్వసభ్య సమావేశం ఎంపీపీ హేమేంద్రకుమార్‌ రెడ్డి అధ్యక్షతన సమావేశం తూతూ మంత్రంగా సాగింది. మండలంలో వివిధ గ్రాంట్లు లో మంజూరైన అభివద్ధి పనులను వెంటనే చేపట్టాలన్నారు. మండలంలో విద్యుత్‌ శాఖ సంబంధించి పలు సమస్యలను విద్యుత్‌ శాఖ అధికారులు దష్టికి తీసుకొచ్చారు. చంద్రగిరి నేషనల్‌ హైవే నుండి శ్రీనివాస మంగాపురం వరకు ఉన్న ఆర్‌అండ్‌బి రోడ్డు, చంద్రగిరి, అనుపల్లి రోడ్డుకు మరమ్మతులు చేయాలని ఆర్‌ అండ్‌బి డిప్యూటీ ఎగ్జిక్యూటివ్‌ ఇంజనీర్‌ సూర్యనారాయణ రెడ్డిని కోరగా, నిధులు మంజూరయ్యాయని వెంటనే మరమ్మతులు చేపడతామని తెలిపారు. మండల మండల సర్వసభ్య సమావేశంలో ప్రతిపక్ష పార్టీకి సంబంధించిన ఎంపీటీసీలు, సర్పంచులు లేకపోవడంతో, అధికార పార్టీ చెందిన ఎంపీటీసీలు సర్పంచ్‌లు ఉండడంతో ప్రజా సమస్యలపై ప్రభుత్వానికి వ్యతిరేకంగా, అధికారులను ప్రశ్నించకపోవడంతో సమావేశం తూతూ మంత్రంగా సాగింది. స్వపక్షానికి చెందిన సభ్యులు వారి ప్రాంతాలలోని పలు సమస్యలను అధికారుల దష్టికి తీసుకొచ్చారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో బాలాజీ నాయక్‌, అన్ని శాఖల అధికారులు, ఎంపీటీసీలు సర్పంచులు పాల్గొన్నారు

➡️