దొంగ ఓట్లు నమోదుపై ఎస్‌పికి ఫిర్యాదు

దొంగ ఓట్లు నమోదుపై ఎస్‌పికి ఫిర్యాదు

దొంగ ఓట్లు నమోదుపై ఎస్‌పికి ఫిర్యాదుప్రజాశక్తి – క్యాంపస్‌ : చంద్రగిరి నియోజక వర్గాన్ని దొంగ ఓట్లు నమోదుకు కేరాఫ్‌ అడ్రస్‌ గా మార్చారని ఎమ్మెల్యే చెవిరెడ్డి పై చిత్తూరు జిల్లా టిడిపి పార్లమెంటు అధ్యక్షుడు, టిడిపి ఎమ్మెల్యే అభ్యర్థి పులివర్తి నాని ధ్వజమెత్తారు. ఆదివారం దొంగ ఓట్లు నమోదుకు కారకులైన వారిపై చర్యలు తీసుకోవాలని తిరుపతి ఎస్పీ, రామచంద్రాపురం, ఎస్‌.వి యూనివర్సిటీ పోలీస్‌ స్టేషన్‌ లో పోలీసులకు ఆయన ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలో కానీ రాష్ట్రంలో కానీ దొంగ ఓట్లు నమోదులో చంద్రగిరి నియోజకవర్గం ముందుందని పేర్కొన్నారు. మొన్న పార్లమెంటు ఎన్నికల్లో ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌ రెడ్డి ఏ విధంగా దొంగ ఓట్లు నమోదు చేయించారో అధికారుల సస్పెండ్‌ తో రుజువైందని తెలిపారు. 2019 ఎన్నికల్లో దొంగ ఓట్లుతో ఎమ్మెల్యే అయిన చెవిరెడ్డి మళ్లీ అదేవిధంగా 6 మండలాల ఎమ్మార్వోలు, ఆర్డీవో లాగిన్‌ లు, ఏఈఆర్‌ ఓ, విఆర్‌ ఓ లాగిన్‌ లతో ప్రైవేట్‌ వ్యక్తులను పెట్టి దొంగ ఓట్లు నమోదు చేయించారని ఆరోపించారు. దీనిపై సెంట్రల్‌ , స్టేట్‌ ఎలక్షన్‌ కమిషన్‌, కలెక్టర్‌, సైబర్‌ క్రైమ్‌ కు ఫిర్యాదు చేశామన్నారు. టిడిపి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

➡️