నారాయణస్వామి ఎక్సైజు గుమస్తా దోచుకోవడమే జగన్‌ మార్క్‌ పాలన27 పథకాల ఎస్సీ కార్పొరేషన్‌ నిర్వీర్యందొంగ ఓట్లకు బ్రాండ్‌ అంంబాసిడర్‌ చెవిరెడ్డిపెద్దిరెడ్డి అక్రమాలు లెక్క పెడుతున్నా…ఎర్రచందనం దొంగలే వైసిపి అభ్యర్థులుజీడీనెల్లూరు సభలో నారా చంద్రబాబు

Feb 6,2024 23:04
నారాయణస్వామి ఎక్సైజు గుమస్తా దోచుకోవడమే జగన్‌ మార్క్‌ పాలన27 పథకాల ఎస్సీ కార్పొరేషన్‌ నిర్వీర్యందొంగ ఓట్లకు బ్రాండ్‌ అంంబాసిడర్‌ చెవిరెడ్డిపెద్దిరెడ్డి అక్రమాలు లెక్క పెడుతున్నా...ఎర్రచందనం దొంగలే వైసిపి అభ్యర్థులుజీడీనెల్లూరు సభలో నారా చంద్రబాబు

నారాయణస్వామి ఎక్సైజు గుమస్తా దోచుకోవడమే జగన్‌ మార్క్‌ పాలన27 పథకాల ఎస్సీ కార్పొరేషన్‌ నిర్వీర్యందొంగ ఓట్లకు బ్రాండ్‌ అంంబాసిడర్‌ చెవిరెడ్డిపెద్దిరెడ్డి అక్రమాలు లెక్క పెడుతున్నా…ఎర్రచందనం దొంగలే వైసిపి అభ్యర్థులుజీడీనెల్లూరు సభలో నారా చంద్రబాబుప్రజాశక్తి – వెదురుకుప్పం, చిత్తూరు అర్బన్‌: ‘డిప్యూటీ సిఎం నారాయణస్వామి ఓ ఎక్సైజ్‌ గుమస్తా.. పెద్దిరెడ్డి, కరుణాకర్‌రెడ్డి, చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి కుర్చీల్లో కూర్చుంటే మన రాష్ట్ర డిప్యూటీ సిఎం నారాయణస్వామి ఎనకాల చేతులు కట్టుకుని ‘జీహుజూర్‌’ అని నిలబడతాడు. ఇది సామాజిక న్యాయమా? దోచుకో..దాచుకో నినాదంతో వైసిపి మార్క్‌ ప్రభుత్వం ముందుకెళుతోంది.. 27 పథకాల ఎస్సీ కార్పొరేషన్‌ను నిర్వీర్యం చేశారు. ఎర్రచందనం స్మగ్లర్లనే జగన్మోహన్‌రెడ్డి అభ్యర్థులుగా నిలబెడుతున్నారు..’ అని టిడిపి అధినేత నారా చంద్రబాబునాయుడు ధ్వజమెత్తారు. ‘రా కదలిరా’ సభ జీడీనెల్లూరు నియోజకవర్గ కేంద్రం రామానాయుడుపల్లి గ్రామ సమీపంలో జరిగింది. చంద్రబాబునాయుడు మాట్లాడుతూ ‘నా బీసీలు, నా దళితులు, నా మైనార్టీలు’ అని ప్రతి సమావేశంలో చెప్పే జగన్మోహన్‌రెడ్డి దళిత ద్రోహి అని, 27 దళిత పథకాలను నాశనం చేశాడన్నారు. కొంతమంది వైసిపి అభ్యర్థులు అవినీతిపరులని పక్కన పెడుతున్నారని, పాపాల పెద్దిరెడ్డి నువ్వు అవినీతిపరుడు కాదా అని ప్రశ్నించారు. అంతర్రాష్ట్ర స్మగ్లర్‌ ఎర్రచందనం దొంగను చిత్తూరు ఎంఎల్‌ఎ అభ్యర్థిగా ప్రకటించిన ఘనత ముఖ్యమంత్రిదేనన్నారు. అవినీతి సొమ్మంతా రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డికే చేరుతుందన్నారు. రానున్న ఎన్నికల్లో టిడిపి విజయం సాధిస్తేనే భవిష్యత్‌ బాగుంటుందన్నారు. తమ హయాంలో భారాలు తగ్గించి, ఆదాయాన్ని పెంచే విధంగా టిడిపి మ్యానిఫెస్టో ఉందన్నారు. మహిళా సాధికారిత కోసం టిడిపి కృషి చేసిందన్నారు. ఎన్నికల్లో బటన్‌ నొక్కితే జగన్‌ మైండ్‌ బ్లాక్‌ అవ్వాలన్నారు. ప్రజలకు సేవ చేసే వాలంటీర్లకు తాను వ్యతిరేకం కాదని, వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ కొమ్ముగాసే వారిని వదిలేది లేదన్నారు. కరెంట్‌ ఛార్జీలు తొమ్మిదిసార్లు పెంచి 64 కోట్ల భారం ప్రజలపై మోపారన్నారు. 60 రూపాయల మద్యం బాటిల్‌ రెండు వందలు చేశారన్నారు. జీడీనెల్లూరులో థామస్‌ను ఆశీర్వదించండి జీడీనెల్లూరు నియోజకవర్గ ఇన్‌ఛార్జిగా ఉన్న థామస్‌ను ప్రజలు ఆదరించాలని పిలుపునిచ్చారు. దళితులకు జగన్‌ ద్రోహం చేశారన్నారు. జిల్లాలో ఎంఎస్‌బాబుకు, ఆదిమూలంకు అసెంబ్లీ టిక్కెట్లు ఇవ్వకుండా మోసం చేశారన్నారు. పెత్తందార్ల ప్రభుత్వంలో దళితులపై ఆరువేల కేసులు పెట్టి, అనేక మంది దళితులను హత్య చేసిన ఘనత జగన్‌ ప్రభుత్వానికే దక్కుతుందన్నారు. జిల్లాలోని మూడు ఎస్సీ నియోజకవర్గాల్లో ముగ్గురు సిట్టింగ్‌ ఎంఎల్‌ఎలను మార్చారంటే దళితులపై వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌కు ఉన్న ప్రేమ అర్ధమవుతుందన్నారు. డిప్యూటీ సిఎం అగ్రకుల గుమస్తాగా ఉన్నారన్నారు. జీడీనెల్లూరులో డిప్యూటీ సిఎంను రీట్రాన్స్‌ఫర్‌ చేశారన్నారు. సత్యవేడు ఎంఎల్‌ఎ స్వయంగా పెద్దిరెడ్డి రోజుకు 200 ఇసుక టిప్పర్లను తమిళనాడుకు పంపుతున్నట్లు చెప్పారని, దీనికి సమాధానం చెప్పాలన్నారు. వైసిపికి పోటీ చేసేందుకు క్యాండెట్లు లేరని, నగరి ఎంఎల్‌ఎ మహిళల భద్రత పట్టించుకోదన్నారు. మున్సిపల్‌ ఛైర్మన్‌పదవి ఇస్తామని లక్షలు దండుకుందని, దొంగ ఓట్లకు బ్రాండ్‌ అంబాసిడర్‌గా చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి స్వర్ణముఖి నదిలో వందల టన్నుల ఇసుక తరలిస్తున్నారన్నారు. ఈ బహిరంగసభలో జీడీనెల్లూరు ఇన్‌ఛార్జి థామస్‌, మాజీ మంత్రి అమరనాథరెడ్డి, తిరుపతి పార్లమెంట్‌ ఇన్‌ఛార్జి నరసింహయాదవ్‌, టిడిపి సీనియర్‌నాయకులు జిజెఎం ట్రస్ట్‌ అధినేత గురజాల జగన్మోహన్‌, జిల్లా పార్లమెంట్‌ అధ్యక్షులు పులివర్తి నాని, మాజీ ఎంఎల్‌సి దొరబాబు, బిసి సెల్‌ రాష్ట్ర నాయకులు సిఆర్‌ రాజన్‌, చిత్తూరు మాజీ మేయర్‌ కఠారి హేమలత, టిడిపి జిల్లా ఉపాధ్యక్షులు కాజూరు బాలాజీ పాల్గొన్నారు.

➡️