నిర్లక్ష్యం నీడలో మంగళం ఆర్టీసీ డిపో

నిర్లక్ష్యం నీడలో మంగళం ఆర్టీసీ డిపో

నిర్లక్ష్యం నీడలో మంగళం ఆర్టీసీ డిపోశ్రీ కూలిన 100 అడుగుల ప్రహరీ గోడశ్రీ కోట్లు విలువ చేసే సామగ్రికి భద్రత ఏదీ?ప్రజాశక్తి- తిరుపతి (మంగళం)బస్సుల మరమ్మతులకు అవసరమైన కోట్లు విలువ చేసే సామగ్రిని ఉంచే ప్రదేశం, బస్సులు నిర్దేశించిన ప్రాంతాలకు వెళ్లి రావడానికి సరిపడినంత ఇంధనాన్ని నింపే చోటుకే రక్షణ లేకుండా పోయింది. ప్రజారవాణా అధికారులు తమకేం పట్టనట్టుగా వ్యవహరిస్తున్నారు. ప్రస్తుతం తిరుపతి- కరకంబాడీ మార్గంలోని మంగళం ఆర్టీసీ డిపో నిర్లక్ష్యం నీడలో ఉందనే చెప్పాలి. తొమ్మిది ఏళ్ల క్రితం డిపోలో కోట్లు విలువ చేసే సామాగ్రి ఉంచాల్సి ఉంటుందని అధికారులు భారీ ప్రహరీని ఏర్పాటు చేశారు. నిర్మాణంలో నాణ్యత లేకపోవడం కారణం కావచ్చు, ప్రకతి పరిణామాలు కావచ్చు, దాదాపు 100 అడుగులకు పైగా డిపో ప్రహరీగోడ మంగళవారం తెల్లవారుజామున కురిసిన వర్షానికి కుప్పకూలిపోయింది. కొద్ది నెలల క్రితం వర్షం కురవడంతో డిపోకు దక్షిణ బాగాన దాదాపు 60 నుంచి 70 అడుగులకు పైగా ప్రహరీ గోడ కూలిపోయింది. అయితే డిపోలో కోట్లు విలువ చేసే సామాగ్రి ఉన్న అధికారులు మాత్రం పట్టనట్టుగా సాధారణ సిమెంట్‌ రేకులను తీసుకువచ్చి అడ్డుపెట్టి మమా అనిపించేశారు. ప్రస్తుతం మంగళవారం ప్రహరీగోడ కూలిపోయిన ప్రాంతంలో పచ్చటి తెరను కట్టి ఉంచారు. కొద్దినెలల క్రితం కుప్పకూలిన ప్రహరీ గోడ నాణ్యతా లోపం కారణంగా కూలిపోయిందా లేక బలమైన వర్షాల కారణంగా కూలిపోయిందా కూడా ఇంతవరకు డిపో అధికారులు బయటి ప్రపంచానికి ఎటువంటి ప్రకటన ఇప్పటివరకు చేయలేదు. దక్షిణ వైపున ప్రహరీగోడ కూలిన తరువాత ప్రజారవాణా ఇంజనీరింగ్‌ అధికారులు తమ వంతు బాధ్యతను నిర్వర్తించి ఉంటే ఈపాటికి గోడ ఎందుకు కూలిందో నివేదిక రూపంలో ఉన్నతాధికారులకు చేరేది. కోట్లు విలువైన బస్సులకు వినియోగించే సామగ్రికి భద్రత కల్పించడంలో అధికారులు ఎందుకింత నిర్లక్ష్యం వహిస్తున్నారనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. తాత్కాలిక మరమ్మతుల వైపు అధికారులు ఎందుకు మొగ్గు చూపుతున్నారో… ప్రహరీ నిర్మాణం నాణ్యత పరిశీలించి పూర్తిస్థాయిలో బలమైన ప్రహరీ గోడను నిర్మించడానికి అధికారులు ఎందుకు ఉపక్రమించడం లేదో అర్థం కావడం లేదు. దక్షిణ వైపు కూలిన ప్రహరీగోడ పునర్నిర్మాణం ఎప్పుడు చేపడతారు అనే విషయాన్ని ప్రజాశక్తి ఆనాడే డిపో మేనేజర్‌ భాస్కర్‌ నాయుడును ప్రశ్నించింది. అప్పుడు ఇప్పుడు డిపో మేనేజర్‌ భాస్కర్‌ నాయుడు ఒకే మాట… ఇంజనీరింగ్‌ అధికారులకు సమాచారం ఇచ్చాం… వారు వచ్చి పరిశీలించి తదుపరి చర్యలు చేపడతారని సమాధానం ఇస్తున్నారు. దీన్ని బట్టి చూస్తే అధికారుల నిర్లక్ష్యం ఏ మేరకు ఉందో ఇట్టే అర్థమవుతుంది. ప్రజారవాణా ఉన్నతాధికారులైన మంగళం డిపో బాగోగులపై ఇప్పటికైనా దష్టి సారించి, పటిష్టమైన ప్రహరీ గోడను నిర్మాణం చేయాలని పలువురు వాపోతున్నారు. తాత్కాలిక చర్యలు చేపట్టాం…- భాస్కర్‌ నాయుడు, మంగళం డిపో మేనేజర్‌ప్రస్తుతం మంగళం డిపోకు తూర్పు వైపుగా కూలిన గోడ ప్రదేశంలో తాత్కాలికంగా తెరను ఏర్పాటు చేశాం. రెండు పక్కల గోడ కూలిపోవడంతో నేను ఇంజనీరింగ్‌ అధికారులను త్వరగా నిర్ణయం తీసుకుని గోడ నిర్మాణం చేపట్టేలా ప్రయత్నాలు సాగిస్తాను.

➡️