నేటి నుంచి జిల్లా స్థాయి ఇన్స్పైర్‌ వైజ్ఞానిక ప్రదర్శన

నేటి నుంచి జిల్లా స్థాయి ఇన్స్పైర్‌ వైజ్ఞానిక ప్రదర్శనప్రజాశక్తి-శ్రీకాళహస్తి జిల్లా స్థాయి ఇన్స్పైర్‌ వైజ్ఞానిక ప్రదర్శనను శనివారం నుంచి రెండు రోజులపాటు నిర్వహించనున్నట్లు జిల్లా సైన్స్‌ అధికారి భాను ప్రసాద్‌ తెలిపారు. పట్టణంలోని ఆర్పీబీఎస్‌ జిల్లా పరిషత్‌ బాలుర ఉన్నత పాఠశాలలో శుక్రవారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శ్రీకాళహస్తి ఆర్‌ పీ బీ ఎస్‌ జిల్లా పరిషత్‌ బాలుర ఉన్నత పాఠశాలలో శని, ఆదివారాల్లో నిర్వహించనున్న ఇన్స్పైర్‌ మనక్‌ వైజ్ఞానిక మేళాను జిల్లా కలెక్టర్‌ లక్ష్మీ శ, ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్‌ రెడ్డి, ఎమ్మెల్సీ సిపాయి సుబ్రహ్మణ్యం, డీఈవో డాక్టర్‌ శేఖర్‌ ప్రారంభించనున్నట్లు తెలిపారు. ఈ మేళాలో జిల్లాలోని వివిధ మండలాల నుంచి 380 నమూనాలు ప్రదర్శనకు రానున్నట్లు చెప్పారు. ఇందులో 10శాతం ఎగ్జిబిట్స్‌ ను ఎంపిక చేసి రాష్ట్ర స్థాయి పోటీలకు పంపనున్నట్లు తెలిపారు. రెండు రోజులపాటు జరిగే ఈ ఎగ్జిబిషన్‌ లో పాల్గొనేందుకు జిల్లాలోని పలు మండలాల నుంచి వచ్చే విద్యార్థులకు భోజనం, వసతి సదుపాయాలు కల్పించేందుకు చర్యలు తీసుకున్నట్లు డీఎస్వో తెలిపారు. సమావేశంలో సమగ్ర శిక్ష సీఎంవో సురేష్‌, ఎంఈవోలు భువనేశ్వరి, బాలయ్య, భాస్కర్‌, ప్రధానోపాధ్యాయులు శ్రీనివాసులు పాల్గొన్నారు.

➡️