నేడు బాధ్యతలు చేపట్టనున్న కలెక్టర్‌ లక్ష్మీషా

నేడు బాధ్యతలు చేపట్టనున్న కలెక్టర్‌ లక్ష్మీషా

నేడు బాధ్యతలు చేపట్టనున్న కలెక్టర్‌ లక్ష్మీషాప్రజాశక్తి – తిరుపతి టౌన్‌ఎండి గృహ నిర్మాణ శాఖ నుండి లక్ష్మీ షా తిరుపతి జిల్లా కలెక్టర్‌గా బదిలీ అయిన నేపథ్యంలో బుధవారం బాధ్యతలు స్వీకరించనున్నారు. మంగళ వారం సాయంత్రం రేణిగుంట విమానాశ్రయం చేరుకున్న వీరికి సంయుక్త కలెక్టర్‌ శుభం బన్సల్‌, విమానాశ్రయ డైరెక్టర్‌ శివప్రసాద్‌, శ్రీకాళహస్తి, తిరుపతి ఆర్డీఓ లు రవి శంకర్‌ రెడ్డి, నిషాంత్‌ రెడ్డి, ట్రైనీ డిప్యూటీ కలెక్టర్‌ ప్రవీణ్‌ కుమార్‌ రెడ్డి, జిల్లా గహ నిర్మాణ శాఖ అధికారి వేంకటేశ్వర రావు, జిల్లా సమాచార పౌర సంబంధాల శాఖ అధికారి బాల కొండయ్య స్వాగతం పలికారు. బుధవారం ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకున్న అనంతరం తిరుపతి జిల్లా కలెక్టర్‌ గా లక్ష్మీ షా బాధ్యతలు చేపట్టనున్నారు.

➡️