పండుగ రోజుల్లోనూ ‘పట్టు’వీడక..37వ రోజూ అంగన్‌వాడీల సమ్మె

పండుగ రోజుల్లోనూ 'పట్టు'వీడక..37వ రోజూ అంగన్‌వాడీల సమ్మె

పండుగ రోజుల్లోనూ ‘పట్టు’వీడక..37వ రోజూ అంగన్‌వాడీల సమ్మెప్రజాశక్తి – గూడూరు టౌన్‌, యంత్రాంగం అంగన్‌వాడీలను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని, కనీస వేతనం పెంచాలన్న ప్రధాన డిమాండ్లతో చేస్తున్న సమ్మె బుధవారానికి 37వ రోజుకు చేరుకుంది. సిఐటియు నాయకులు బివి రమణయ్య, ఎస్‌. సురేష్‌ మాట్లాడుతూ ఐసిడిఎస్‌ బలోపేతానికి బడ్జెట్‌ పెంచాలన్నారు. సుప్రీం తీర్పు మేరకు గ్రాడ్యుటీ తక్షణమే అమలు చేయాలన్నారు. మినీ సెంటర్లను మెయిన్‌ సెంటర్లుగా మార్చాలన్నారు. సర్వీసులో ఉండి చనిపోయిన కుటుంబంలో ఒకరికి ఉద్యోగం కల్పించాలన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు అంగన్‌వాడీలకు అందేలా చూడాలన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు జోగి శివకుమార్‌, అంగన్‌వాడీ అధ్యక్షురాలు ఎ.ఇంద్రావతి, కార్యదర్శి ప్రభావతి, సెక్టార్‌ లీడర్స్‌ మునికుమారి, మంగమ్మ, లక్ష్మిప్రసన్న, భారతి పాల్గొన్నారు. – నాయుడుపేటలో ఐసిడిఎస్‌ వద్ద అంగన్‌వాడీలు చేస్తున్న సమ్మెకు సిపిఎం జిల్లా కార్యదర్శి వందవాసి నాగరాజు సంఘీభావం ప్రకటించారు. అంగన్‌వాడీలకు షోకాజ్‌ నోటీసులు ఇచ్చి భయభ్రాంతులకు గురిచేసే విధానాన్ని మానుకోవాలని సిడిపిఒ దృష్టికి తీసుకెళ్లారు. గతంలో రైతుల ఆందోళన విషయంలో బిజెపి ప్రభుత్వం కాలయాపన చేసిందని, ఇపుడు జగన్మోహన్‌రెడ్డి అంగన్‌వాడీలను పండగ పూట రోడ్లపై కూర్చోబెట్టారన్నారు. ఇదే విధానాలు కొనసాగితే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ప్రాజెక్టు కార్యదర్శి ఎన్‌.శ్యామలమ్మ, నాగమ్మ, కళావతి, వాణి, సంధి, సిఐటియు నాయకులు శివకవి ముకుంద పాల్గొన్నారు. – నారాయణవనంలో రాజకీయ, అధికారుల బెదిరింపులకు భయపడేది లేదని అంగన్‌వాడీ వర్కర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ నాయకులు పద్మావతి, నరసమ్మ, జ్యోతి, వాణి హెచ్చరించారు. – రేణిగుంటలో 37 అంకె ఆకారంలో అంగన్‌వాడీ అక్కచెల్లెమ్మలు సమ్మెను కొనసాగించారు. 25వ రోజు రిలే దీక్షల్లో 10 మంది నిరసన తెలిపారు. ఐసిడిఎస్‌ ప్రాజెక్టు అధ్యక్ష కార్యదర్శులు ధనమ్మ, భాగ్యలక్ష్మి మాట్లాడుతూ జగన్మోహన్‌రెడ్డి నిర్లక్ష్య ధోరణి దుర్మార్గ చర్యన్నారు. జగనన్న ప్రభుత్వం చర్చలకు పిలిపించి వెంటనే జీతాలు పెంచాలని, రిటైర్మెంట్‌ బెనిఫిట్స్‌ ఐదు లక్షలు ఇవ్వాలని, గ్రాడ్యుటీ అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. విజయలక్ష్మి, అంబికా, పార్వతి, రేవతి, లక్ష్మి, ప్రభావతి, పాండురంగమ్మ, ఉష ఐఎఫ్టియు నాయకులు రాధమ్మ, విజయలక్ష్మి, సిపిఎం సీనియర్‌ నాయకులు వెంకటరమణ, ఏర్పేడు మండలం సిఐటియు కార్యదర్శి కరీముల్లా, కెవిపిఎస్‌ మండల కార్యదర్శి సెల్వరాజ్‌ సమ్మెకు మద్దతుగా నిలిచారు. – తిరుపతి టౌన్‌లో పాత కార్పొరేషన్‌ కార్యాలయం వద్దనే సమ్మె కొనసాగుతోందని నగర అధ్యక్షురాలు జయప్రద, ఎల్లమ్మ, గోమతి,గీత తెలిపారు. – పుత్తూరు టౌన్‌లో సిఐటియు జిల్లా కార్యదర్శి ఆర్‌.వెంకటేష్‌, అంగన్‌వాడి నాయకురాలు మునికుమారి ఆధ్వర్యంలో తహశీల్దార్‌ కార్యాలయం వద్ద సమ్మె కొనసాగింది. – వెంకటగిరిలో సిఐటియు జిల్లా నాయకులు వడ్డిపల్లి చెంగయ్య, ఎపి అంగన్‌వాడీ వర్కర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ యూనియన్‌ నాయకులు ఎ.మంజుల, ఎన్‌.స్వరూపరాణి, సుభాషిని ఆధ్వర్యంలో సమ్మెలో భాగంగా రిలేదీక్షలను కొనసాగించారు. – సూళ్లూరుపేటలో మేకల హైమావతి, సిఐటియు నాయకులు రమణయ్య, పద్మనాభయ్య ఆధ్వర్యంలో సమ్మె కొనసాగింది.

➡️