పునరావాస కేంద్రంలో ఆకలి కేకలు

పునరావాస కేంద్రంలో ఆకలి కేకలు

పునరావాస కేంద్రంలో ఆకలి కేకలుబాలాయపల్లి : మండలంలోని అంబలపూడి గ్రామ గిరిజనులకు ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రంలో గిరిజనులు ఆకలితో అలమటించారు. చేపలను వేటాడి జీవించే గిరిజనులను రెవెన్యూ అధికారులు ఆదివారం సాయంత్రం గ్రామంలో ఉన్న ప్రాధమిక పాఠశాలలో పునరావాసం ఏర్పాటు చేశారు. ఆదివారం రాత్రి భోజనం ఏర్పాటు చేశారు. సోమవారం ఉదయం టిఫీన్‌, మధ్యహ్నం భోజనం ఏర్పాటు చేయడం మరిచారు. పాఠశాలలో దాదాపు 30 మంది చిన్నారులు, వద్ధులు ఆకలికి తట్టుకోలేక గజగజ వణుకుతూ కనిపించారు.మండల ప్రజలు భయపడవద్దని, తాను ఉన్నానని మండల వైసిపి అధ్యక్షులు జయంపు సహకార సంఘం అధ్యక్షులు వెందోటి కార్తీక్‌రెడ్డి అన్నారు. ముంపు ప్రాంతాలను సోమవారం సందర్శించారు. కలుజుకు అడ్డంగా ఉన్న తాటిమానులను తొలగించారు. ఆయన వెంట గున్నంరెడ్డి భాస్కర్‌రెడ్డి ఉన్నారు.

➡️