పెన్షనర్ల సమస్యలు పరిష్కరించాలి

పెన్షనర్ల సమస్యలు పరిష్కరించాలి

పెన్షనర్ల సమస్యలు పరిష్కరించాలిప్రజాశక్తి -కోట నెల్లూరు జిల్లా కలెక్టర్ల కార్యాలయం వద్ద విశ్రాంత ఉద్యోగులు సోమవారం ధర్నా నిర్వహించారు. పెన్షనర్ల సమస్యలను పరిష్కరించాలని కలెక్టర్‌కు రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్ల అసోసియేషన్‌ సంఘం నాయకులు వినతిపత్రం అందజేశారు. నాయకులు మాట్లాడుతూ పెండింగ్‌ డిఎ బకాయిలను వెంటనే చెల్లించాలని, 11వ పిఆర్‌సి అరియర్స్‌ను వెంటనే అందజేయాలని, 70 ఏళ్లు నిండిన వారికి 10 శాతం, 75 నిండిన వారికి 15శాతం పునరుద్ధరించాలన్నారు. హెల్త్‌కార్డుల ద్వారా గుర్తింపు పొందిన ఆస్పత్రుల్లో వైద్యం అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంఎల్‌సి విఠపు బాలసుబ్రమణ్యం, సంఘం అధ్యక్షులు గౌస్‌బాష, ప్రధాన కార్యదర్శి నరసింహమూర్తి, సీనియర్‌ నాయకులు బాబు రెడ్డి పాల్గొన్నారు.

➡️