‘పేట’లో ఇంటర్‌ మాస్‌ కాపీయింగ్‌నిబంధనలు తుంగలో తొక్కిన విద్యాశాఖ ‘శ్రీవేమ’లో లెక్చరరే డిపార్టుమెంట్‌ ఆఫీసర్‌పరీక్షా కేంద్రం కేటాయింపుల్లోనే అక్రమాలు

'పేట'లో ఇంటర్‌ మాస్‌ కాపీయింగ్‌నిబంధనలు తుంగలో తొక్కిన విద్యాశాఖ 'శ్రీవేమ'లో లెక్చరరే డిపార్టుమెంట్‌ ఆఫీసర్‌పరీక్షా కేంద్రం కేటాయింపుల్లోనే అక్రమాలు

‘పేట’లో ఇంటర్‌ మాస్‌ కాపీయింగ్‌నిబంధనలు తుంగలో తొక్కిన విద్యాశాఖ ‘శ్రీవేమ’లో లెక్చరరే డిపార్టుమెంట్‌ ఆఫీసర్‌పరీక్షా కేంద్రం కేటాయింపుల్లోనే అక్రమాలునాయుడుపేట ‘శ్రీవేమ’ ఇంటర్‌ పరీక్షా కేంద్రంలో మాస్‌ కాపీయింగ్‌ జోరుగా జరుగుతున్నట్లు విద్యార్థులే ఆరోపిస్తున్నారు. జిరాక్స్‌ చిట్టీలు అందిస్తూ కాలేజీ లెక్చరరే డిపార్టుమెంట్‌ ఆఫీసర్‌గా వ్యవహరిస్తూ ఈ మాస్‌ కాపీయింగ్‌కు తెరదీసినట్లు తెలుస్తోంది. విషయాన్ని ఆర్‌ఐఒ దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోకపోవడంతో లక్షల్లో చేతులు మారడం వల్లనే చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి వెల్లువెత్తుతున్నాయి. కష్టపడి చదివిన విద్యార్థుల తల్లిదండ్రులు మాస్‌ కాపీయింగ్‌పై మండిపడుతున్నారు. ప్రజాశక్తి – నాయుడుపేట నాయుడుపేట ప్రభుత్వ కళాశాల విద్యార్థులు, సూళ్లూరుపేట విద్యార్థులను నాయుడుపేటలోని శ్రీ వేమా జూనియర్‌ కాలేజీ ప్రైవేట్‌ పరీక్షా కేంద్రంలో వేశారు. డిపార్టుమెంటల్‌ ఆఫీసర్‌గా ప్రభుత్వ జూనియర్‌ కళాశాల లెక్చరర్‌ను పథకం ప్రకారం వేసుకుని మాస్‌ కాపీయింగ్‌కు పాల్పడుతున్నారు. ఈ విషయమై తిరుపతి ఆర్‌ఐఒను శనివారం వివరణ కోరగా పరీక్షా కేంద్రంలో విధుల కేటాయింపులు, అవకతవకలు వాస్తవమేనని, నిబంధనల ప్రకారం కళాశాల విద్యార్థులు పరీక్ష రాసే చోట అదే (నాయుడుపేట గవర్నమెంట్‌ కళాశాల) లెక్చరర్లు అధికారులుగా వేయకూడదని తెలిపారు. సదరు అధికారులను వెంటనే పరీక్షా కేంద్రం నుంచి రిలీవ్‌ చేస్తామని చెప్పారు. అయినా సోమవారం జరిగిన పరీక్షకూ యధావిధిగా సదరు సిబ్బంది విద్యార్థులతో మాస్‌ కాపియింగ్‌ యథాతధంగా చేయించడం గమనార్హం. ఈ మాస్‌ కాపీయింగ్‌ వెనుక తిరుపతి ఆర్‌ఐఒ హస్తం ఉందని, సూళ్లూరుపేట విద్యార్థులకు పేట పరీక్షా కేంద్రం ఎలా కేటాయిస్తారని, కావాలనే నాయుడుపేట ప్రైవేట్‌ కేంద్రాన్ని కేటాయించారన్న ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. పరీక్షా కేంద్రాల కేటాయింపుల్లోనే అధికారులు చేతివాటం చూపారని తెలుస్తోంది. నాయుడుపేట పట్టణంలో ఇంటర్‌ పరీక్షల్లో ప్రైవేట్‌ కళాశాలల యాజమాన్యాలు చక్రం తిప్పడంతో పరీక్షా కేంద్రాల్లో మాస్‌ కాపీయింగ్‌ జోరుగా సాగుతోంది. దీంతో ప్రతిరోజూ సాయంత్రం జిరాక్స్‌ కేంద్రాల వద్ద మైక్రో జిరాక్స్‌ల కోసం గుంపులు గుంపులుగా విద్యార్థులు దర్శనమిస్తున్నారు. నాయుడుపేటలో ఇంటర్మీడియట్‌ పబ్లిక్‌ పరీక్ష ప్రహసనంగా మారిపోయింది. దీంతో కష్టపడి చదివిన విద్యార్థులకు శాపంగా మారిందని తల్లిదండ్రులు మండిపడుతున్నారు. ఇకనైనా వేమ జూనియర్‌ కళాశాలలో విధులు నిర్వహిస్తున్న చీఫ్‌ సూపరింటెండెంట్‌ అధికారులను, ఇన్విజిలేటర్లను మార్పు చేసి వారి స్థానంలో వేరే అధికారులను నియమించాలని తల్లిదండ్రులు కోరుతున్నారు.

➡️