పోలింగ్‌ కేంద్రాల్లో పక్కాగా ఏర్పాట్లు : అదితి సింగ్‌

పోలింగ్‌ కేంద్రాల్లో పక్కాగా ఏర్పాట్లు : అదితి సింగ్‌

పోలింగ్‌ కేంద్రాల్లో పక్కాగా ఏర్పాట్లు : అదితి సింగ్‌ తిరుపతి టౌన్‌ : తిరుపతి నియోజకవర్గ పరిధిలోని పోలింగ్‌ కేంద్రాలలో ఓటర్లకు అన్ని ఏర్పాట్లూ పక్కాగా చేయాలని తిరుపతి నియోజకవర్గ ఓటర్‌ నమోదు అధికారి, నగరపాలక సంస్థ కమిషనర్‌ అదితి సింగ్‌ అధికారులను ఆదేశించారు. శనివారం మధ్యాహ్నం నగరంలోని పలు పోలింగ్‌ కేంద్రాలను, ఎస్వీ ఆర్ట్స్‌ కాలేజీలో స్ట్రాంగ్‌ రూమ్‌ ఏర్పాటు గదులను అధికారులతో కలిసి కమిషనర్‌ పరిశీలించారు. ముందుగా ఈవియం, బ్యాలెట్‌ బాక్సులు భద్ర పరిచేందుకు ఎస్వీ ఆర్ట్స్‌ కాలేజీలో స్ట్రాంగ్‌ రూమ్‌ ఏర్పాటు గదులను పరిశీలించారు. ఫ్యాన్లు, విద్యుత్‌ దీపాలు, తాగునీరు, మరుగుదొడ్ల సౌకర్యం ఉండేలా చూడాలని అన్నారు. అలాగే అన్ని పోలింగ్‌ కేంద్రాల్లోకి వద్దులు, వికలాంగులు వెళ్లేందుకు ర్యాంప్‌ ఏర్పాటు చేయాలన్నారు. కమిషనర్‌ వెంట డిప్యూటీ కమిషనర్‌ అమరయ్య, డి.ఈ. మహేష్‌, తేజస్విని ఉన్నారు.

➡️