ప్రశాంతంగా పది పరీక్షలు ప్రారంభం162 పరీక్ష కేంద్రాల్లో 95.24 శాతం హాజరు 6 ఫ్లయింగ్‌ స్క్వాడ్‌, 162 మంది చీఫ్‌ సూపరిటెండెంట్లు 1753 మంది ఇన్విజిలేటర్‌లతో పర్యవేక్షణ

ప్రశాంతంగా పది పరీక్షలు ప్రారంభం162 పరీక్ష కేంద్రాల్లో 95.24 శాతం హాజరు 6 ఫ్లయింగ్‌ స్క్వాడ్‌, 162 మంది చీఫ్‌ సూపరిటెండెంట్లు 1753 మంది ఇన్విజిలేటర్‌లతో పర్యవేక్షణ

ప్రశాంతంగా పది పరీక్షలు ప్రారంభం162 పరీక్ష కేంద్రాల్లో 95.24 శాతం హాజరు 6 ఫ్లయింగ్‌ స్క్వాడ్‌, 162 మంది చీఫ్‌ సూపరిటెండెంట్లు 1753 మంది ఇన్విజిలేటర్‌లతో పర్యవేక్షణప్రజాశక్తి- తిరుపతి : పదో తరగతి పరీక్షలు సోమవారం ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. తిరుపతి జిల్లాలో 162 పరీక్ష కేంద్రాల్లో, 6 ఫ్లయింగ్‌ స్క్వాడ్లు, 162 మంది చీఫ్‌ సూపరింటెండెంట్లు, 1753 మంది ఇన్విజిలేటర్ల పర్యవేక్షణలో ప్రశాంతంగా పరీక్షలను జిల్లా విద్యాశాఖ అధికారులు నిర్వహించారు. సోమవారం ఉదయం నిర్వహించిన తెలుగు పరీక్షకు మొత్తం 28,415 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకోగా వారిలో 27,063 మంది విద్యార్థులు మాత్రమే పరీక్షకు హాజరయ్యారు. మిగిలిన 1352 మంది విద్యార్థులు పరీక్షకు గైర్హాజరైనట్లు తిరుపతి జిల్లా విద్యాశాఖ అధికారి శేఖర్‌ పేర్కొన్నారు. 95.24 శాతం మంది విద్యార్థులు హాజరైనట్లు ప్రకటించారు. విద్యార్థులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా పకడ్బందీగా ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. అలాగే తిరుపతి అర్బన్‌ పరిధిలో 36 పరీక్షా కేంద్రాల్లో పరీక్షల్లో ప్రశాంతంగా నిర్వహించినట్లు పేర్కొన్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు తలెత్తకుండా ముందస్తు ప్రణాళికలతో పరీక్షలు నిర్వహించేందుకు పటిష్ట చర్యలు తీసుకున్నట్లు చెప్పారు. బుచ్చినాయుడు కండ్రిగ: మండల కేంద్రంలో 398 మంది విద్యార్థులు పరీక్ష రాయాల్సి ఉండగా 31 మంది విద్యార్థులు గైర్హాజరైనట్లు విద్యాశాఖ అధికారి రవీంద్రనాథ్‌ తెలిపారు. సత్యవేడు: బాలుర గురుకుల పాఠశాల కేంద్రంలో 244 మంది విద్యార్థులు గాను 241 మంది పరీక్షలకు హాజరైనట్టు సంబంధిత పరీక్షల ప్రధాన అధికారి మారయ్య, డిపార్ట్మెంట్‌ అధికారి రమేష్‌ పేర్కొన్నారు. పుత్తూరు టౌన్‌: పట్టణంలోని తొమ్మిది కేంద్రాల్లో 1367 మందికి గాను 1332 మంది విద్యార్థులు పది పబ్లిక్‌ పరీక్షలు రాయగా 35 మంది గైర్హాజరైనట్లు ఎంఈవో తెలిపారు. దొరవారిసత్రం: మండల కేంద్రంలో 463 మంది విద్యార్థులు పది పరీక్షలు రాసినట్లు ఎంఈవో తెలిపారు. పరీక్షా కేంద్రాలను తహశీల్దార్‌ ప్రసాద్‌, డిప్యూటి తహశీల్దార్‌ గోపిరెడ్డి పరిశీలించారు.

➡️