బాల్య వివాహ రహిత భారతదేశాన్ని చూడాలి:ఎంపీపీ

బాల్య వివాహ రహిత భారతదేశాన్ని చూడాలి:ఎంపీపీ

బాల్య వివాహ రహిత భారతదేశాన్ని చూడాలి:ఎంపీపీ ప్రజాశక్తి-నాయుడుపేట : బాల్య వివాహ రహిత భారతదేశాన్ని చూడాలని ఎంపీపీ ధనలక్ష్మి పేర్కొన్నారు. అంతర్జాతీయ దినోత్సవం పురస్క రించుకొని నవంబర్‌ 25 నుండి 4 వారాలపాటు జెండర్‌ క్యాపెయిన్‌ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో భాగంగా మొదటివారం మహిళలకు భయం, వివక్ష, హింస లేకుండా గౌరవ ప్రదమైన జీవితానికి నిర్మాణాత్మక అడ్డంకుల పరిష్కారం , లింగ వైవిధ్య వ్యక్తుల హక్కులను కాపాడడంపై ర్యాలీ నిర్వహించారు. రెండవ వారం బాల్య వివాహా రహిత భారత దేశం పై అవగాహనా కార్యక్రమం నిర్వహించా లని తెలిపారు. ఈ కార్యక్రమంలో అరవ పెరిమిడి సర్పంచ్‌ శంకరయ్య, ఏరియా కో ఆర్డినేటర్‌ మురళి ,ఏ పి ఎం ప్రసన్న, సిసిఎస్‌ పాల్గొన్నారు.

➡️