భరత్‌ను గెలిపిస్తే మరింత అభివృద్ధి కుప్పంకు నీరు మా హయాంలోనే…రూ.535 కోట్లతో మరో రెండు రిజర్వాయర్లు శాంతిపురం సభలో సిఎం జగన్మోహన్‌రెడ్డి రామకుప్పంలో హంద్రీనీవా జలాలు విడుదల

భరత్‌ను గెలిపిస్తే మరింత అభివృద్ధి కుప్పంకు నీరు మా హయాంలోనే...రూ.535 కోట్లతో మరో రెండు రిజర్వాయర్లు శాంతిపురం సభలో సిఎం జగన్మోహన్‌రెడ్డి రామకుప్పంలో హంద్రీనీవా జలాలు విడుదల

భరత్‌ను గెలిపిస్తే మరింత అభివృద్ధి కుప్పంకు నీరు మా హయాంలోనే…రూ.535 కోట్లతో మరో రెండు రిజర్వాయర్లు శాంతిపురం సభలో సిఎం జగన్మోహన్‌రెడ్డి రామకుప్పంలో హంద్రీనీవా జలాలు విడుదలప్రజాశక్తి – రామకుప్పం, శాంతిపురం కొండలు, గుట్టలు దాటుకుని 672 కిలోమీటర్ల మేర శ్రీశైలం ప్రాజెక్టు నుంచి హంద్రీనీవా సుజల స్రవంతి ద్వారా కుప్పం నియోజకవర్గానికి నీళ్లందించే ఈ గొప్ప కార్యక్రమం చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించాల్సిందేనని సిఎం జగన్మోహన్‌రెడ్డి అన్నారు. భరత్‌ను ఎంఎల్‌ఎగా గెలిపిస్తే మంత్రిని చేసి మరింత అభివృద్ధి చేస్తానన్నారు. ఈసారి గెలిపిస్తే రూ.535 కోట్లతో మరో రెండు రిజర్వాయర్ల నిర్మాణం చేపడతానన్నారు. కుప్పం నియోజకవర్గంలో సోమవారం రామకుప్పం, శాంతిపురం మండలాల్లో సిఎం జగన్మోహన్‌రెడ్డి పర్యటన సాగింది. మరింత నీటి స్టోరేజి కోసం సాగు, తాగునీటి కష్టాలకు శాశ్వతంగా చెక్‌పెట్టేలా రూ.535 కోట్లతో మరో ఐదువేల ఎకరాలకు సాగునీరు అందించేలా రెండు కొత్త రిజర్వాయర్ల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. రామకుప్పంలో హంద్రీనీవా జలాలను విడుదల చేసిన అనంతరం శాంతిపురంలో గుండుశెట్టిపల్లె వద్ద బహిరంగసభలో ప్రసంగించారు. కుప్పం, పలమనేరు నియోజకవర్గాల్లో 6,300 ఎకరాల ఆయకట్టుకు సాగునీరు, 4.02 లక్షల మందికి తాగునీరు అందుతుందన్నారు. చంద్రబాబు హయాంలో కుప్పం బ్రాంచి కెనాల్‌ నిర్మాణం ప్రారంభదశలో తన వాళ్లకు కాంట్రాక్టులు కట్టబెట్టి అంచనాలు పెంచి తక్కువ డబ్బులు ఖర్చు పెట్టే పనులు మాత్రమే చేసి ఖజానాను దోచుకున్నారన్నారు. కుప్పంలో 87,941 కుటుంబాలు ఉంటే తన 58 నెలల పాలనలో 82,039 కుటుంబాలకు 93.29శాతం ప్రయోజనం అందించామన్నారు. కుప్పం నియోజకవర్గానికి ఎవరివల్ల మేలు జరిగిందో ఆలోచించాలని కోరారు. సొంత నియోజకవర్గమైన చంద్రగిరిలో ప్రజలు ఆయన్ను ఓడిస్తే, కుప్పానికి వచ్చి ధనబలంతో బీసీ సీటును కబ్జా చేసి నియంతలా కొనసాగుతున్నారన్నారు. 35 ఏళ్లు గెలిచిన కుప్పంలో కనీసం ఇల్లు కట్టుకోవాలనే ఆలోచన చంద్రబాబుకు రాకపోవడం దారుణమన్నారు. వంగవీటిరంగాను హత్య చేయించడం వల్లనే కాపులంతా చంద్రబాబును వర్గశత్రువుగా భావిస్తున్నారన్నారని విమర్శించారు. తన హయాంలో కుప్పానికి రెవెన్యూ డివిజన్‌, మున్సిపాలిటీ, పోలీసు సబ్‌ డివిజన్‌ ఇచ్చానన్నారు. ప్రతిపక్ష నాయకుని నియోజకవర్గమని చూడకుండా కుప్పానికి నీళ్లిచ్చి, సంక్షేమ పథకాలు అందించానన్నారు. ప్రతిష్టాత్మక వేలూరు మెడికల్‌ కాలేజీని చిత్తూరుకు రాకుండా అడ్డుకున్నది చంద్రబాబేనని అన్నారు. కుప్పం ప్రజలకు చంద్రబాబు చేసింది సున్నా అన్నారు. కుప్పం నియోజకవర్గానికి నీరందించిందిలా..కుప్పం బ్రాంచ్‌ కెనాల్‌లో 68.466 కిమీ వద్ద క్రాస్‌ రెగ్యులేటర్‌ (రామకుప్పం మండలం రాజుపేట వద్ద) నుంచి మద్దికుంటచెరువు (2.91 ఎంసీఎఫ్‌టీ), నాగసముద్రం చెరువు (0.25 ఎంసీఎఫ్‌టీ), మనేంద్రం చెరువు (13.78 ఎంసీఎఫ్‌టీ), తొట్లచెరువు (33.02 ఎంసీఎప్‌టీ)లకు సీఎం జగన్‌ కష్ణాజలాలను విడుదల చేశారు. ఆ తర్వాత మిగతా 106 చెరువులకు కష్ణాజలాలను విడుదల చేయడంతో కుప్పం, పలమనేరు నియోజకవర్గాల్లో 6,300 ఎకరాల ఆయకట్టుకు సాగునీరు, 4.02 లక్షల మందికి తాగునీరు అందుతుందని జగన్మోహన్‌ రెడ్డి తెలిపారు.సిఎంకు ఘన స్వాగతం రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి సోమవారం ఉదయం అమరావతి నుంచి బయల్దేరి రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్నారు. అక్కడనుంచి ప్రత్యేక హెలికాఫ్టర్‌లో ఉదయం 11.05 గంటలకు రామకుప్పం మండలం రాజుపేట వద్ద ఏర్పాటు చేసిన హెలిపాడ్‌కు వచ్చారు. డిప్యూటీ సిఎం నారాయణస్వామి, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు, రాజంపేట, చిత్తూరు ఎంపిలు పెద్దిరెడ్డి వెంకట మిథున్‌రెడ్డి, ఎన్‌.రెడ్డెప్ప, ఎంఎల్‌సిలు భరత్‌, సిపాయి సుబ్రమణ్యం, జలవనరుల శాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ శశిభూషణ్‌కుమార్‌, కలెక్టర్‌ ఎస్‌.షన్మోహన్‌, ఎస్‌పి జాషువా పుష్పగుచ్ఛాలు అందించి స్వాగతం పలికారు. మరో రెండు రిజర్వాయర్లకు శంకుస్థాపన గుడిపల్లి మండలంలోని యామగానిపల్లి వద్ద ఓ రిజర్వాయర్‌ను, శాంతిపురం మండలం మాదనపల్లి వద్ద మరో రిజర్వాయర్‌ను రూ.535 కోట్లతో నిర్మించడానికి శంకుస్థాపన చేశారు. వీటి నిర్మాణం పూర్తయితే మరో ఐదువేల ఎకరాలకు సాగునీరు అందుతుందన్నారు. పాలారు ప్రాజెక్టుకు సంబంధించి 0.6 టిఎంసిల కెపాసిటీతో చిన్నపాటి రిజర్వాయర్‌ను రూ.215 కోట్లతో కట్టడానికి పరిపాలనా అనుమతులు ఇచ్చామన్నారు. మళ్లీ సిఎంగా గెలుపొందాక ఈ మూడు ప్రాజెక్టులను పూర్తి చేస్తానన్నారు. భరత్‌ను గెలిపిస్తే మంత్రిని చేస్తా ఎంఎల్‌సి భరత్‌ను కుప్పం ఎంఎల్‌ఎగా ఎన్నుకోండి.. ఎంఎల్‌సిగా ఉండే ఎంతో చేశారు. ఎంఎల్‌ఎగా మీరు గెలిపిస్తే తన క్యాబినెట్‌లో మంత్రిని చేస్తానని, తద్వారా కుప్పంకు మరింత అభివృద్ధి, సంక్షేమం చేస్తానన్నారు. రంగురంగుల మానిఫెస్టోలు చూసి మోసపోవద్దని, ప్రతి ఇంటికీ కేజీ బంగారం, బెంజికారు కొనిస్తానంటాడని ఎద్దేవా చేశారు.సాదర వీడ్కోలు రేణిగుంట : చిత్తూరు జిల్లా పర్యటన ముగించుకుని రేణిగుంట విమానాశ్రయం చేరుకున్న రాష్ట్ర ముఖ్యమంత్రికి సాదర వీడ్కోలు లభించింది. సాయంత్రం 4.09 గంటలకు గన్నవరం విమానాశ్రయానికి తిరుగు ప్రయాణమయ్యారు. కలెక్టర్‌ లక్ష్మీశ, సంయుక్త కలెక్టర్‌ శుభం బన్సల్‌, ఎస్‌పి మలిక గర్గ్‌, కమిషనర్‌ అదితి సింగ్‌, టిటిడి ఛైర్మన్‌ భూమన కరుణాకర్‌రెడ్డి, ఎంపి గురుమూర్తి, చంద్రగిరి, శ్రీకాళహస్తి ఎంఎల్‌ఎలు చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, బియ్యపు మధుసూదన్‌రెడ్డి , శ్రీకాళహస్తీశ్వర స్వామి దేవస్థానం చైర్మన్‌ అంజూరి శ్రీనివాసులు, ఈఓ శ్రీకాళహస్తి నాగేశ్వర్‌ రావు, ఆర్డీఓ శ్రీకాళహస్తి రవిశంకర్‌ రెడ్డి ఉన్నారు. ముఖ్యమంత్రికి శివరాత్రి ఉత్సవాల ఆహ్వానంప్రజాశక్తి-శ్రీకాళహస్తి రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డికి మార్చి మూడో తేదీ నుంచి అంగరంగ వైభవంగా జరగబోయే మహాశివరాత్రి బ్రహ్మౌత్సవాల ఆహ్వాన పత్రికను అందజేశారు. కుప్పం పర్యటన నిమిత్తం సీఎం జగన్‌ సోమవారం రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్నారు. సమాచారం అందుకున్న ఆలయ అధికారులు ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్‌ రెడ్డి, ఆలయ చైర్మన్‌ అంజూరు తారక శ్రీనివాసులు, ఈవో నాగేశ్వరరావు ఆధ్వర్యంలో సీఎంకు ఆహ్వాన పత్రికలు అందజేసి శివరాత్రి ఉత్సవాలకు రావాలని ఆహ్వానించారు.సిఎం జగన్‌ను కలిసిన వీసీలు, రిజిస్ట్రార్లుప్రజాశక్తి – క్యాంపస్‌శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం వైస్‌-ఛాన్సలర్‌ ప్రొఫెసర్‌ డి.భారతి, రిజిస్ట్రార్‌ ప్రొఫెసర్‌ ఎన్‌. రజని రేణిగుంట విమానాశ్రయంలో కుప్పం పర్యటనకు విచ్చేసిన ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డిని మర్యాద పూర్వకంగా కలిశారు. శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయానికి పీఎం ఉష స్కీం కింద 100 కోట్లు మంజూరు అవడం పట్ల యూనివర్సిటీ వైస్‌-ఛాన్సలర్‌ ప్రొఫెసర్‌ డి.భారతిని, రిజిస్ట్రార్‌ ప్రొఫెసర్‌ ఎన్‌. రజనిని ముఖ్యమంత్రి అభినందించారు.కుప్పం నియోజకవర్గం రామకుప్పం మండలానికి విచ్చేసిన రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు వై.ఎస్‌ జగన్మోహన్‌ రెడ్డిని ద్రావిడ విశ్వవిద్యాలయ ఉపకులపతి ఆచార్య కొలకలూరి మధుజ్యోతి కలిశారు. ద్రావిడ విశ్వవిద్యాలయంలో నెలకొన్న సమస్యలపై ఆయనకు వివరించారు. విశ్వవిద్యాలయానికి అదనపు బడ్జెట్‌ను కేటాయించాలని ముఖ్యమంత్రిని కోరారు. ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగుల సమస్యల గురించి వివరించారు.

➡️