మయూర జయరాంచౌదరిని అరెస్టు చేయాలి

మయూర జయరాంచౌదరిని అరెస్టు చేయాలి

మయూర జయరాంచౌదరిని అరెస్టు చేయాలిప్రజాశక్తి -తిరుపతి టౌన్‌చెరకు రైతుల బకాయిలు ఇవ్వకుండా ఎగ్గొట్టిన మయూర సుగర్‌ ఫ్యాక్టరీ యాజమాన్యం జయరాంచౌదరిని అరెస్టు చేయాలని రైతుసంఘం ఆధ్వర్యంలో ఎస్‌పికి వినతిపత్రం అందజేశారు. రైతుసంఘం జిల్లా కార్యదర్శి హేమలత మాట్లాడుతూ 2018 సంవత్సరానికి చెరకు తోలిన రైతులకు ఇప్పటివరకు బకాయిలు చెల్లించలేదని వాపోయారు.ఎన్నో పోరాటాల ఫలితంగా కలెక్టర్‌ చొరవ చేసి 16 కోట్లు ఇప్పించారని, మిగతా 30 కోట్ల బకాయిల కోసం వేలం వేయడానికి ప్రయత్నించగా స్టేఆర్డర్‌ తెచ్చి ఆపేశారన్నారు. ఆ కేసులో రైతులు ఇంప్లేట్‌ అయినప్పటికీ కేసు ముందుకు నడవడం లేదని, ఇప్పటికే ఐదు సంవత్సరాలు గడుస్తుందని, ఇంకా ఎన్ని సంవత్సరాలు ఎదురుచూడాలని ఆవేదన వ్యక్తం చేశారు. రైతులు వడ్డీలకు వడ్డీలు కట్టలేక ఇబ్బందులు పడుతున్నారని, చౌదరిని అప్పుడగడానికి వెళ్లిన రైతుల్ని కులం పేరుతో దూషించినందుకు బి .యన్‌. కండ్రిగలో అట్రాసిటీ కేసు నమోదయిందనీ, అంతేకాక పోరాట ఒత్తిడిని తట్టుకోలేక ఒక సందర్భంలో 15కోట్లు చెక్కు ఇచ్చారనీ అది బౌన్స్‌ అయ్యిందన్నారు. ఈ రెండు కేసులు మీద ఆయన్ని అరెస్టు చేయాలన్నారు. రైతుల్ని ఇన్ని రకాలుగా బాధిస్తున్న జయరాం చౌదరిని అరెస్టు చేసి రైతులకు న్యాయం చేయాలని ఆమె ఎస్పీకి విజ్ఞప్తి చేశారు . ఈ కార్యక్రమంలో భాస్కర్‌ నాయుడు, విజరు కుమార్‌, గంగుల నాయుడు ,శంకర్‌ రెడ్డి, సుబ్రహ్మణ్యం ,రేణుకమ్మ సాంబశివరాజు తదితరులు పాల్గొన్నారు.

➡️