మరోసారి పేదల ప్రభుత్వానికి అవకాశం ఇవ్వండి: అలీ

మరోసారి పేదల ప్రభుత్వానికి అవకాశం ఇవ్వండి: అలీ

మరోసారి పేదల ప్రభుత్వానికి అవకాశం ఇవ్వండి: అలీప్రజాశక్తి-వెంకటగిరి: మరోసారి పేదల ప్రభుత్వానికి అవకాశం కల్పించాలని సీనినటుడు అలీ కోరారు. శుక్రవారం వెంకటగిరి ని యోజకవర్గంలో వైసిపి నిర్వహించిన సామాజిక సాధికార బస్సు యాత్రలో ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈబస్సు యాత్ర వెంకటగిరి నేదురుమల్లి నివాసం నుండి ర్యాలీగా వెంకటగిరిలోని కాశీపేట, పాలకేంద్రం మీదుగా డక్కిలి మీదుగా రాపూరుకు చేరుకుంది. డక్కిలిలో నిర్వహించిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ ప్రజలకు ఇచ్చిన హమీలన్నీ అమలు చేసిన ఘనత ఒక్క జగన్‌ మోహన్‌రెడ్డికే దక్కిందన్నారు. ఎక్కడా అమలు సంక్షేమ పథకాలను ఆంధ్రప్రదేశ్‌ అమలు చేసి చూపించిన పార్టీ వైసిపి యేనని కొనియాడారు. మరోసారి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి ఈప్రాంత ఎమ్మెల్యే అభ్యర్ధిగా బరిలో ఉన్న నేదురుమల్లి రామ్‌ కుమార్‌రెడ్డి అవకాశం కల్పించాలన్నారు. ఈ బస్సు యాత్రలో వెంటగిరి నియోజకవర్గ సమన్వకర్త నేదురుమల్లి రామ్‌ కుమార్‌రెడ్డి, తిరుపతి పార్లమెంట్‌ సభ్యులు గురుమూర్తి, సూళ్లురుపేట ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య, వెంకటగిరి రాజ కుటుంబీకులు సర్వజ్ఞకుమార యాచేంద్ర పాల్గొన్నారు.

➡️