మస్తాన్‌ యాదవ్‌ వైసిపిలోకి జంప్‌

మస్తాన్‌ యాదవ్‌ వైసిపిలోకి జంప్‌ప్రజాశక్తి – వెంకటగిరి వెంకటగిరి నియోజకవర్గంలో జంపింగ్‌లతో రెండు ప్రధాన పార్టీల్లోనూ గందరగోళం నెలకొంది. టిడిపి కార్యదర్శిగా ఉన్న మస్తాన్‌ యాదవ్‌కు ఎంఎల్‌ఎ అభ్యర్థిగా టిక్కెట్‌ కేటాయించకపోవడంతో ఆ పార్టీకి రాజీనామా చేశారు. కురుగొండ్ల లక్ష్మీ సాయిప్రియకు టిక్కెట్‌కేటాయించే సమయంలో తనను సంప్రదించకుండానే కేటాయించారన్నది అతని వాదన. కనీసం టిక్కెట్‌ కేటాయించిన తర్వాతనైనా తనను సంప్రదించలేదని వాపోయారు. అవమానం పొందినచోట ఇమడలేకనే టిడిపికి రాజీనామా చేసినట్లు చెప్పారు. వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ అభ్యర్థి నేదురుమల్లి రాంకుమార్‌రెడ్డిని కలిసి ఆ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. అయితే వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీలో ఆనం వైసిపి నాయకులకు, ప్రజాప్రతినిధులకు గాలం వేశారు. వెంకటగిరి ఎంపిపి, డక్కిలి జడ్‌పిటిసి, బాలాయపల్లి ఎంపిపి, సర్పంచులు, ఎంపిటిసిలతో రెబల్‌ గ్రూపును ఆనం వెనకుండి నడిపిస్తున్నారు. వెస్‌ఆర్‌ కాంగ్రెస్‌ రెబల్‌ అభ్యర్థిగా నిలబడతానని మాజీ డిసిబి ఛైర్మన్‌ మెట్టుకూరు ధనంజయరెడ్డి వెంకటగిరి పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించారు. రెండు పార్టీల్లోనూ లుకలుకలు ఉండడంతో ఏ పార్టీకి ఎంత నష్టం జరుగుతుందో వేచి చూడాల్సిందే.

➡️