మాతా శిశు మరణాల నివారణకు అన్ని చర్యలూ చేపట్టాలిఆరోగ్య అధికారులకుజిల్లా టాస్క్‌ ఫోర్స్‌ అధికారుల ఆదేశం

మాతా శిశు మరణాల నివారణకు అన్ని చర్యలూ చేపట్టాలిఆరోగ్య అధికారులకుజిల్లా టాస్క్‌ ఫోర్స్‌ అధికారుల ఆదేశం

మాతా శిశు మరణాల నివారణకు అన్ని చర్యలూ చేపట్టాలిఆరోగ్య అధికారులకుజిల్లా టాస్క్‌ ఫోర్స్‌ అధికారుల ఆదేశంప్రజాశక్తి -దొరవారిసత్రం : ఏ మహిళా ప్రసవ సమయంలో మరణించ కూడదని, శిశు మరణాల నివారణకు అన్ని చర్యలూ చేపట్టాలని ఆరోగ్యశాఖ లక్ష్యాన్ని నిజం చేయాలంటే వైద్య ఆరోగ్యశాఖ సిబ్బంది ప్రజారోగ్య విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలని తిరుపతి జిల్లా టాస్క్‌ ఫోర్స్‌ అధి కారులు ఆదేశించారు. గురువారం దొరవారి సత్రం మండలంలోని కొత్తపల్లి వైయస్సార్‌ విలేజ్‌ హెల్త్‌ క్లినిక్‌ పరిధిలో జరుగుతున్న ప్రజారోగ్య కార్యక్ర మాలు, మాతా శిశు సేవలు, రక్తహీనతకు గురవు తున్న కారణాలు, గురించి జిల్లా స్టాటిస్టికల్‌ అధికారి నాగేంద్రబాబు, డిపిహెచ్‌ఎన్‌ఓ బేబీ రాణిలు కొత్తపల్లి విలేజ్‌ హెల్త్‌ క్లినిక్‌ ని సందర్శించి ఆ పరిధిలో జరిగిన గర్భవతుల నమోదు నుండి ప్రసవం వరకు వైద్య సిబ్బంది వారికి అందించిన సేవలు, తీసు కున్న జాగ్రత్తలు గురించి పలు రికార్డులను క్షుణ్ణంగా పరిశీలించి పలు సూచనలు చేశారు. గర్భిణులను ప్రత్యక్షంగా ప్రశ్నిస్తూ, ఐరన్‌ మాత్రలు ఎన్ని ఇచ్చారు? క్యాల్షియం మాత్రలు ఇవ్వాల్సిన మోతాదులో ఇచ్చారా? లేదా.. ప్రతి మాసంలో పీహెచ్సీకి తీసుకువెళ్లి అన్ని పరీక్షలు చేయిస్తున్నారా?’ అని ఆరా తీశారు. పిల్లలకు సరైన సమయంలో అందవలసిన టీకాలు వేస్తున్నారా ? లేదా..’ అనే దానిపై ఆరోగ్య సిబ్బంది పలు రికార్డులతో పాటు, గర్భిణీకిచ్చిన ఎన్సిపి కార్డు ఆన్‌లైను చేసిన రిపోర్టుకు తేడా పరిశీలించారు. ఎంఎల్‌హెచ్‌పి, ఏఎన్‌ఎం ఇద్దరి రికార్డు ఒకేలా ఉండాలని, తేడాలు ఉండ కూడదని సూచించారు. ప్రధానంగా బరువు తక్కువ పిల్లలు పుట్టకుండా ఉండాలంటే గర్భం దాల్చి నప్పటి నుంచి సమ పోషకాలు కలిగిన ఆహారాన్ని తీసు కుంటూ రక్త వద్ధి కోసం ఆకుకూరలు అధికంగా సేవిం చాలని గర్భవతులకు సూచించారు. అనంతరం ప్రాథమి క పాఠశాలలో రక్తహీనత కలిగిన పిల్లలను పరిశీలించి వారిలో ఉండే రక్త శాతాన్ని హిమోగ్లోబిన్‌ పరీక్ష ద్వారా గుర్తించారు ప్రతి గురువారం తప్పక ఐరన్‌ మాత్ర వేయాలని హెచ్‌ఎం కి సూచించారు. మాతా శిశు మర ణాలు జరగకుండా జాగ్రత్తలు పాటించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో దొరవారిసత్రం పిహెచ్సి మెడికల్‌ ఆఫీసర్స్‌ వి చైతన్య, ఎ చంద్రకళ, సి హెచ్‌ ఓ సంపూర్ణమ్మ, పిహెచ్‌ఎన్‌ పద్మావతి, హెచ్‌ ఎస్‌ గోపి కిరణ్‌, ఎం ఎల్‌ హెచ్‌ పి రాజేశ్వరి, సచివాలయ ఏఎన్‌ఎం సురేఖ, ఆశ కార్యకర్తలు హాజరయ్యారు.

➡️