ముందస్తు క్రిస్మస్‌ సంబరాలు

ముందస్తు క్రిస్మస్‌ సంబరాలు

ముందస్తు క్రిస్మస్‌ సంబరాలుప్రజాశక్తి -రేణిగుంట : రాస్‌ మహిళా జ్యోతి మ్యూచువల్‌ బెనిఫిట్‌ ట్రస్ట్‌ పొదుపు సంఘాల సభ్యుల ఆధ్వర్యంలో తారక రామా నగర్‌ లోని చర్చిలో ముందస్తు క్రిస్మస్‌ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి యూనియన్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా అసిస్టెంట్‌ మేనేజర్‌ శివకుమార్‌ పాస్టర్‌ లుకాస్‌ పాల్గొన్నారు. ఈ సందర్భంగా పాస్టర్‌ లూకాస్‌ మాట్లాడుతూ డిసెంబర్‌ మాసం అంటేనే క్రిస్మస్‌ గుర్తుకు వస్తుందన్నారు. ఈ మాసం అంతా కూడా ప్రతి ఒక్కరూ ఘనంగా ఈ పండుగను జరుపుకుంటారన్నారు. ఈ క్రిస్మస్‌ని రాస్‌ ఆధ్వర్యంలో సభ్యులందరూ ఉత్సాహంగా కులాలకు మతాలకు అతీతంగా ఘనంగా చేసుకోవడం చాలా ఆనందంగా ఉందన్నారు. రెండువేల సంవత్సరాల క్రితం డిసెంబర్‌ 24న అర్థరాత్రి దాటిన తర్వాత జీసస్‌ జన్మించాడని ప్రతి సంవత్సరం 25 వ తేదీన క్రిస్మస్‌ పండుగను జరుపుకుంటారని ఆనందం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో రాస్‌ మహిళా జ్యోతి మ్యూచువల్‌ బెనిఫిట్‌ ట్రస్ట్‌ ట్రస్టీలు, లీడర్లు, సిబ్బంది పాల్గొన్నారు.

➡️