మెడికల్‌ రెప్స్‌ సమ్మె

మెడికల్‌ రెప్స్‌ సమ్మె

మెడికల్‌ రెప్స్‌ సమ్మెప్రజాశక్తి – తిరుపతి టౌన్‌ మందుల ధరలు తగ్గించాలని, మందులపై జిఎస్‌టి ఎత్తి వేయాలని మెడికల్‌ రిప్రజెంటేటివ్‌ల దేశవ్యాప్త ఒక్కరోజు సమ్మెలో భాగంగా తిరుపతి పాత మున్సిపల్‌ కార్పొరేషన్‌ కార్యాలయం ఎదుట యూనియన్‌ రాష్ట్ర కార్యదర్శి రామక్రిష్ణ ఆధ్వర్యంలో విజయవంతం చేశారు. రామక్రిష్ణ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం చేపట్టిన కార్మిక చట్టాల మార్పును వ్యతిరేకిస్తున్నామన్నారు. యాజమాన్యాల దాడులు ఎక్కువయ్యాయని,పనిభారం విపరీతంగా పెరిగిందన్నారు. పని ఒత్తిడి తట్టుకోలేక రిప్రజెంటేటివ్‌లు మృతిచెందుతున్నారన్నారు. సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి కందారపు మురళి, జిల్లా ఉపాధ్యక్షులు గండికోట నాగ వెంకటేష్‌ సంఘీభావం తెలిపారు. యూనియన్‌ కార్యదర్శి రాజేష్‌, రాష్ట్ర కమిటి సభ్యులు ఆనంద్‌, యూనియన్‌ నాయకులు కిరణ్‌, శ్రీనివాస్‌ నాగరాజు, రాజగోపాల్‌ పాల్గొన్నారు.

➡️