‘రవీంద్రభారతి స్కూల్‌’ కిజాతీయ స్థాయి ప్రతిష్టాత్మక ఎక్షలెన్సీ అవార్డు

'రవీంద్రభారతి స్కూల్‌' కిజాతీయ స్థాయి ప్రతిష్టాత్మక ఎక్షలెన్సీ అవార్డు

‘రవీంద్రభారతి స్కూల్‌’ కిజాతీయ స్థాయి ప్రతిష్టాత్మక ఎక్షలెన్సీ అవార్డుప్రజాశక్తి-తిరుపతి టౌన్‌: ప్రతి సంవత్సరం బ్రెయిన్‌ ఫీడ్‌ మేగజైన్‌ వారు దేశవ్యాప్తంగా విద్యారంగలో విశిష్ట సేవలను అందించే పాఠశాలలను ఎంపిక చేసి వారికి జాతీయ స్థాయిలో ప్రతిష్టాత్మక ఎక్షలెన్సీ అవార్డులను ప్రధానం చేస్తారు. ఈ ఏడాది ఆ అవార్డుకు తిరుపతి నగరం కొర్లగుంటలోని రవీంద్రభారతి స్కూల్‌ ఎంపిక కావడం పట్ల ఆ స్కూల్‌ కరస్పాండెంట్‌ రవీంద్రనాథరెడ్డి హర్షం వ్యక్తం చేశారు. శుక్రవారం 15వ తేదీన హైదరాబాద్‌ హైటెక్‌ సిటి ఎగ్జిబిషన్‌ హాల్‌-2 నందు నిర్వహించిన బహుమతి ప్రధానోత్సవంలో రవీంద్రభారతి స్కూల్‌ కరస్పాండెట్‌ రవీంద్రనాథరెడ్డి అవార్డును అందుకున్నారు. ఈసందర్బంగా ఆయన మాట్లాడుతూ తమ స్కూల్‌కు ఇంతటి ప్రతిష్టాత్మక అవార్డు రావడం తిరుపతికే గర్వకారణమని అన్నారు. ఈ అవార్డు తమ బాధ్యతను ఇంకా పెంచిందని అన్నారు. ఇంత గొప్ప అవార్డు రావడానికి కషి చేసిన ఉపాధ్యాయ బందానికి, సహకరించిన తల్లిదండ్రులకు, విద్యార్థులకు హదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు.

➡️