రాయలసీమ సమగ్రాభివద్ధికై ఉద్యమిద్దాం సిపిఎం కేంద్ర కమిటీ సభ్యులు ఎంఎ గఫూర్‌

రాయలసీమ సమగ్రాభివద్ధికై ఉద్యమిద్దాం సిపిఎం కేంద్ర కమిటీ సభ్యులు ఎంఎ గఫూర్‌

రాయలసీమ సమగ్రాభివద్ధికై ఉద్యమిద్దాం సిపిఎం కేంద్ర కమిటీ సభ్యులు ఎంఎ గఫూర్‌ ప్రజాశక్తి- తిరుపతి బ్యూరో, తిరుపతి టౌన్‌: వెనుకబాటు తనానికి మారుపేరుగా నిలిచిన రాయలసీమ సమగ్రాభివద్ధికై ఐక్యంగా ఉద్యమిద్దామని వివిధ రాజకీయపార్టీల నేతలు పిలుపునిచ్చారు. జనచైతన్య వేదిక ఆంధ్రప్రదేశ్‌ కమిటీ ఆధ్వర్యంలో ఆదివారం ఉదయం తిరుపతి నగరంలోని వేమన విజ్ఞాన కేంద్రంలో రాయలసీమ అభివద్ధి సమస్యలపై జరిగిన చర్చాగోష్టికి జనచైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు వల్లంరెడ్డి లక్ష్మణరెడ్డి అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా సిపిఎం కేంద్ర కమిటీ సభ్యుడు, మాజీ శాసనసభ్యులు ఎంఎ.గఫూర్‌, రాజ్యసభ మాజీ సభ్యులు కాంగ్రెస్‌ పార్టీ మీడియా కమిటీ రాష్ట్ర ఛైర్మన్‌ డాక్టర్‌ ఎన్‌.తులసీ రెడ్డి ప్రసంగిస్తూ రాష్ట్ర విభజన చట్టం హామీలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేయనందున రాయలసీమ తీవ్రంగా నష్టపోయిందన్నారు. బుందేల్‌ ఖండ్‌ ప్యాకేజీ అమలు చేయకపోవడం, స్టీల్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా నేతత్వంలో కడప స్టీల్‌ ఫ్యాక్టరీని పొందలేకపోవటం, హైకోర్టును సాధించలేకపోవడం, నీటిపారుదుల ప్రాజెక్టులను పూర్తి చేసుకోలేకపోవడం వలన రాయలసీమ ప్రాంతం అభివద్ధి కాలేకపోయిందన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 18 లక్షల మోటారు బావులుండగా ఒక్క రాయలసీమలోనే 12 లక్షల మోటార్‌ బావులు ఉన్నాయని వీటన్నింటికీ స్మార్ట్‌ మీటర్లు పెడితే రాయలసీమ రైతులకు అవి ఉరితాళ్ళు గా మారుతాయని అన్నారు. రాయలసీమ సమగ్ర అభివద్ధి ప్రణాళికను రూపొందించి వాటి అమలుకు రాజకీయాలకు అతీతంగా ఐక్యంగా కషి జరగాలన్నారు. హంద్రీనీవా సజన స్రవంతి, గాలేరు-నగరి ప్రాజెక్టులను సత్వరం పూర్తి చేసుకోవాలన్నారు. పోలవరం ప్రాజెక్టు పూర్తయితే ఆంధ్రప్రదేశ్‌కు నీటిసమస్య పరిష్కారం అవుతుందని తెలిపారు. జన చైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు వల్లంరెడ్డి లక్ష్మణరెడ్డి మాట్లాడుతూ 1956 నుండి ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం నీటిపారుదల ప్రాజెక్టుల కోసం ఆయా రాష్ట్ర బడ్జెట్లలో 10శాతం పైగా కేటాయించి ఖర్చుచేస్తే నేటి ప్రభుత్వం గత ఐదు బడ్జెట్లలో ఐదు శాతం లోపే కేటాయించి, మూడు శాతం మాత్రమే వ్యయం చేసిందన్నారు. నీటిపారుదల ప్రాజెక్టులపట్ల రాష్ట్ర ప్రభుత్వ నిరాశక్తత ఫలితంగా రాయలసీమ కరువు ప్రాంతంగా మారిందన్నారు. నేటి ప్రభుత్వం ఉత్పాదక రంగాలకు వెచ్చించకుండా అనుత్పాదక రంగాలకు వ్యయం చేయడం, అభివద్ధిపై దష్టి పెట్టకపోవడం, అప్పులు చేసి ప్రజలను యాచకులుగా మారుస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. జనసేన పార్టీ ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షులు డాక్టర్‌ పసుపులేటి హరిప్రసాద్‌ ప్రసంగిస్తూ రాయలసీమకు నీరు, నిధులు, నియామకాలు జరగాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం కక్షపూరిత వైఖరి కారణంగా వేలాది మందికి ఉపాధి అందించే అమర్‌ రాజా ఫ్యాక్టరీ తెలంగాణకు తరలిపోయిందన్నారు. సిపిఐ రాష్ట్ర సీనియర్‌ నేత జి.ఓబులేష్‌ ప్రసంగిస్తూ వరదకు కొట్టుకుపోయిన అన్నమయ్య ప్రాజెక్టుకు రూ.10కోట్లు వెచ్చించలేకపోవడం వలన గత మూడు సంవత్సరాలుగా పునర్నిర్మాణం జరగలేదన్నారు. రాయలసీమ ప్రాంత అభివద్ధికి ఏమేమి చేస్తారో అన్ని రాజకీయ పార్టీలు ఎన్నికల ప్రణాళికలో తెలపాలన్నారు. తెలుగుదేశం పార్టీ నేత మాజీ శాసనసభ్యులు ఎం.సుగుణమ్మ ప్రసంగిస్తూ రాయలసీమ ప్రాంతంలో నీటిపారుదల ప్రాజెక్టుల కోసం తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం చేసిన వ్యయంలో నాలుగో వంతు కూడా వైసిపి ప్రభుత్వం చేయలేకపోయిందన్నారు. ఈ చర్చాగోష్టిలో తెలుగుదేశం పార్టీ తిరుపతి పార్లమెంట్‌ నియోజకవర్గ అధ్యక్షులు జి.నరసింహ యాదవ్‌, వూక విజయకుమార్‌, సిపిఎం జిల్లా కార్యదర్శి వి.నాగరాజు, సిపిఐ నేతలు రాధాకష్ణ, పెంచలయ్య కాంగ్రెస్‌ పార్టీ నేత నవీన్‌ కుమార్‌రెడ్డి, జనసేన పార్టీ నగర అధ్యక్షులు రాజారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

➡️