రాష్ట్రాన్ని నిలువునా ముంచేశారు..!బిజెపికి ప్రత్యేక హోదా ఇవ్వాలని లేదు ఫ్యాన్లు, సైకిళ్లు బయట పడేయండిరూ.12 లక్షల కోట్లు నష్టపోయాం

రాష్ట్రాన్ని నిలువునా ముంచేశారు..!బిజెపికి ప్రత్యేక హోదా ఇవ్వాలని లేదు ఫ్యాన్లు, సైకిళ్లు బయట పడేయండిరూ.12 లక్షల కోట్లు నష్టపోయాం

రాష్ట్రాన్ని నిలువునా ముంచేశారు..!బిజెపికి ప్రత్యేక హోదా ఇవ్వాలని లేదు ఫ్యాన్లు, సైకిళ్లు బయట పడేయండిరూ.12 లక్షల కోట్లు నష్టపోయాంప్రజాశక్తి-తిరుపతి(మంగళం)ప్రత్యేక హోదా ఇస్తామని నమ్మబలికి ఆంధ్ర రాష్ట్ర ప్రజలను కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం నిలువునా ముంచేసిందని, గడిచిన 10 ఏళ్లలో విభజింపబడిన ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం 12 లక్షల కోట్ల విలువ గల ప్రయోజనాలను కోల్పోయిందని ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల రెడ్డి అన్నారు. బిజెపికి తొత్తులుగా వ్యవహరిస్తున్న వైసిపి, టిడిపి ఫ్యాన్లు, సైకిళ్లను ఊరి బయట పడేయాలని సభ పిలుపునిచ్చింది. బిజెపితో వైసిపి టిడిపి ట్రై యాంగిల్‌ లవ్‌ స్టోరీ నడుపుతున్నారన్నారు. కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రత్యేక హోదా పదేళ్ల పాటు ఇస్తామని డిక్లరేషన్‌ ప్రకటించింది. శుక్రవారం తిరుపతి తారకరామా స్టేడియంలో కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వర్యంలో ప్రత్యేక హౌదా డిక్లరేషన్‌ న్యాయ సాధన సభను నిర్వహించారు. ఈ సందర్భంగా వైఎస్‌ షర్మిల రెడ్డి మాట్లాడుతూ ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కు అని, కాంగ్రెస్‌ పార్టీ మాత్రమే ఆంధ్రప్రదేశ్‌ కు ప్రత్యేక హోదా ఇవ్వడానికి కట్టుబడి ఉందన్నారు. 2014లో ఇదే మైదానంలో ఏర్పాటు చేసిన వేదికపై ఆనాటి ప్రధానమంత్రి అభ్యర్థిగా ఉన్న నరేంద్ర మోడీ నేడు ప్రధానమంత్రిగా కొనసాగుతున్నా ఇప్పటివరకు ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి ప్రత్యేక హౌదా ఇవ్వడానికి బిజెపికి ఇష్టం లేదని తేటతెల్లమైపోయిందన్నారు. ప్రత్యేక హౌదా ఇచ్చే కాంగ్రెస్‌ పార్టీని ప్రజలు ఆదరించాలని విజ్ఞప్తి చేశారు. ఇప్పటికే రాహుల్‌ గాంధీ ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి ప్రత్యేక హౌదా ఇవ్వడానికి కేంద్రంలో యూపీఏ ప్రభుత్వం అధికారంలోకి రాగానే మొదటి సంతకం చేస్తానని ప్రకటించారన్నారు. తల్లి లాంటి ఆంధ్రప్రదేశ్‌ కి ప్రత్యేక హౌదా ఇవ్వకుండా పదేళ్లుగా చంపుతున్నారని, మూకుమ్మడి రాజీనామాలు చేస్తే ప్రత్యేక హౌదా ఎందుకు రాదు అన్న వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి అధికారంలోకి వచ్చి ప్రత్యేక హౌదా కోసం ఏమి పోరాటాలు చేశారో చెప్పాలన్నారు. తెలుగుదేశం పార్టీ, వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీలు రెండు బిజెపితో అంతర్గత పొత్తు కలిగినవేనని తేల్చి చెప్పారు. బిజెపి ప్రవేశపెట్టిన ప్రతి బిల్లుకూ ఈ రెండు పార్టీలు పరోక్షంగా సహకారం అందించాయన్న విషయాన్ని ప్రజలు గుర్తించాలన్నారు. ఇందిరమ్మ అభయ హస్తం ద్వారా ప్రతి పేద కుటుంబానికి 5 వేల రూపాయలు ఇచ్చే గ్యారెంటీ స్కీమును ఇప్పటికే ప్రకటించామన్నారు. ఏఐసిసి కార్యదర్శి సచిన్‌ పైలట్‌ మాట్లాడుతూ విభజింపబడ్డ ఆంధ్రప్రదేశ్‌ కు మంచి ప్రయోజనాలు చేకూరాలనే లక్ష్యంతో బుందేల్‌ఖండ్‌ తరహాలో సాయం, వెనుకబడిన రాయలసీమకు ప్రత్యేక నిధుల కేటాయింపు వంటి అంశాలతో విభజన చట్టాన్ని రూపొందించి, ఆర్థిక కమిషన్‌ కు పంపించామన్నారు. విభజన చట్టాన్ని అమలు చేయాల్సిన అధికారంలోకి వచ్చిన బిజెపి ప్రభుత్వం పదేళ్లు గడిచినా కుంటి సాకులు చెబుతూ ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్రానికి ప్రత్యేక హౌదా ఇవ్వలేదన్నారు. గడిచిన 10 ఏళ్లలో ఇప్పటివరకు కార్పొరేట్లకు అండగా నిలుస్తూ వారికి రాయితీలు ఇస్తున్నారే గాని దేశంలోని రైతులకు, నిరుద్యోగులకు, గిరిజనులకు ఎటువంటి ప్రయోజకర పాలసీలను బిజెపి సర్కార్‌ తీసుకురాలేదన్నారు. మాజీ శాసనసభ్యులు, సిపిఎం నేత ఎంఎ గఫూర్‌ మాట్లాడుతూ ప్రత్యేక హౌదా కోసం ఇండియా కూటమిలో చేరామని, ప్రత్యేక హౌదా కోసం ఏ పోరాటానికైనా కలిసి వస్తామన్నారు. ప్రధాని మోడీ తిరుపతి దేవుని సన్నిధిలో ఇచ్చిన మాటను తప్పి ఆ మూడు నామాలవాడికే పంగనామాలు పెట్టిన మోసగాడన్నారు. బిజెపి మతాన్ని ఆయుధంగా చేసుకుని విద్వేషాలను రెచ్చగొడుతూ దేశ విచ్చిన్ననికి పాటుపడుతోందన్నారు. సిపిఐ జాతీయ నాయకులు నారాయణ మాట్లాడుతూ ఫ్యాను, సైకిల్‌ ను ఊరి బయట పడేయాలని అన్నారు. కేంద్ర హౌం మంత్రిగా ఉన్న అమిత్‌ షా ఒక హత్య కేసు నుండి బయట పడడానికి 12 మందిని చంపాడని ఆరోపించారు. వైయస్‌ రాజశేఖర్‌ రెడ్డి బొమ్మతో అధికారంలోకి వచ్చిన జగన్మోహన్‌ రెడ్డి నేడు ఆయన ఫోటోనే కనుమరుగు చేశాడన్నారు. అధికారం కోసం వాడుకుని వదిలేయడం వైసిపి, టిడిపి పార్టీలకు పరిపాటిగా మారిపోయిందన్నారు. మాజీ ఎంపీ చింతామోహన్‌ మాట్లాడుతూ కాంగ్రెస్‌ పార్టీ ప్రత్యేక హౌదా ఇవ్వడానికి సిద్ధంగా ఉందని, ప్రజలు కాంగ్రెస్‌ పార్టీకి మద్దతుగా నిలవాలన్నారు. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి తిరుపతి రాజధానిగా అవ్వాలని ఆకాంక్షించారు. ప్రత్యేక హౌదా డిక్లరేషన్‌ న్యాయ సాధన సభకు వేల సంఖ్యలో ప్రజలు హాజరయ్యారు. ఈ సభలో కాంగ్రెస్‌ నాయకులు కనుమూరి బాపిరాజు, గిడుగు రుద్రరాజు, రఘువీరా రెడ్డి, జెడి శీలం, పల్లం రాజు, రాకేష్‌, కాంగ్రెస్‌ పార్టీ మహిళా విభాగ అధ్యక్షురాలు తాంతియా కుమారి, సునీల, ఆప్‌ రాష్ట్ర నాయకులు మణి నాయుడు, సిపిఎం, సిపిఐ జిల్లా కార్యదర్శులు వందవాసి నాగరాజు, కె.మోహన్‌ పాల్గొన్నారు.

➡️